శనివారం 24 అక్టోబర్ 2020
Warangal-city - Aug 14, 2020 , 03:02:37

ఎర్రగట్టుగుట్ట జంక్షన్‌లో మారుతీ కార్ల సర్వీస్‌ సెంటర్‌ ప్రారంభించిన ఎమ్మెల్యే

ఎర్రగట్టుగుట్ట జంక్షన్‌లో మారుతీ కార్ల సర్వీస్‌ సెంటర్‌ ప్రారంభించిన ఎమ్మెల్యే

  •  గండ్ర వెంకటరమణారెడ్డి

భీమారం, ఆగస్టు13: భీమారం ఎర్రగట్టు గుట్ట జంక్షన్‌లో విన్‌ మోటర్స్‌ షోరూం మారుతీ సుజుకి కంపెనీ కార్ల సర్వీస్‌ సెంటర్‌ను గురువారం భూ పాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ప్రా రంభించారు. విన్‌ మోటార్స్‌ సర్వీస్‌ సెంటర్‌లో ముందుగా ఆయనతోపాటు వరంగల్‌ రూరల్‌ జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌ జ్యోతిరెడ్డి, విన్‌ మోటర్స్‌ ఎండీ గండ్ర గౌతమ్‌ రెడ్డి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతమ్‌ రెడ్డి మా ట్లాడుతూ మారుతీ సుజుకి కంపెనీ వివిధ రకాల మోడల్స్‌ కార్లు, అన్ని రకాల స్పేర్‌ పార్ట్స్‌ను అం దుబాటులో ఉంచుతూ సర్వీసింగ్‌ చేస్తామన్నారు. మారుతీ కార్ల కస్టమర్ల సౌకర్యం కోసం సర్వీసింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో గండ్ర భూపాల్‌రెడ్డి, గండ్ర రూప, అభిలాష్‌రెడ్డి, సాయిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.logo