శుక్రవారం 30 అక్టోబర్ 2020
Warangal-city - Aug 14, 2020 , 02:26:08

కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ హామీ నెరవేర్చాలి

కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ హామీ నెరవేర్చాలి

ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌

కాజీపేట: కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని  కేంద్రం ఆరేళ్ల క్రితం చేసిన హామీని వెంటనే నెరవేర్చాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం కొండపల్లిలో మేధ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ భూమి పూజలో గురువారం పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండి రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని  పట్టిం చుకోవడం లేదన్నారు.

వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చే శారు. వరంగల్‌లో త్వరలో ఏర్పాటు చేయనున్న మోనో, మె ట్రో రైళ్ల లోకోమోటివ్‌లు మేధ ఫ్యాక్టరీ నుంచే రావాలని కోరారు. కాజీ పేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయడం సంతోషంగా ఉందని టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు, రైల్వే కార్మిక వర్గాలు, తదితరులు సంతోషం వ్యక్తం చేశారు.