శుక్రవారం 30 అక్టోబర్ 2020
Warangal-city - Aug 12, 2020 , 02:39:00

రైల్వే జంక్షన్‌కు నిధుల వరద

రైల్వే జంక్షన్‌కు నిధుల వరద

కాజీపేట రైల్వే జంక్షన్‌ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ఎంపీలు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. పలు మార్లు రైల్వే శాఖతో సంప్రదింపులు జరిపి ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులపై ప్రధాని మోదీ, రైల్వే మంత్రి, కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు వినతి పత్రాలు సమర్చిం చారు. ఎట్టకేలకు స్పందించిన ప్రధాని.. ప్రగతి పోర్టల్‌ పథకం కింద కాజీపేట జంక్షన్‌ అభివృద్ధి కోసం రూ.115 కోట్లు కేటా యించారు. వీటితో జంక్షన్‌ పరంగా పలు అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు ఆధునీకరణ దిశగా కాజీపేటను తీర్చిదిద్ద నున్నారు. ప్రధాని పర్యవేక్షణలో జరిగే ఈ పనులు 2023 మార్చి వరకు పూర్తి కానున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. 

రైల్వే యార్డుకు రూ.40 కోట్లు కేటాయింపు..

రాష్ట్రంలో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ తర్వాత రెండో అతి పెద్ద రైల్వే జంక్షన్‌గా కాజీపేట విరాజిల్లుతోంది. ఈమేరకు విశాలమైన స్థలంలో రైల్వే యార్డును(రీమోడలింగ్‌) తీర్చిదిద్దనున్నారు. ఇందుకు రైల్వేశాఖ రూ.40 కోట్లు కేటాయించింది. యార్డు అభివృద్ధిలో భాగంగా కాజీపేట రైల్వే జంక్షన్‌ ఆధునికీకరణ, రెండు ప్లాట్‌ఫారాలు, ప్రయాణికులకు మౌలిక వసతులు కల్పించనున్నారు. అలాగే యార్డులో రైళ్లను నిలిపేందుకు ఆధునిక విధానాన్ని అనుసరించనున్నారు. రైల్వే భవనాల నిర్మాణంతో పాటు యార్డు నుంచి రెండు రైళ్లు వెళ్లేందుకు రైలు పట్టాలు వేయనున్నారు. పాత ఫిట్‌లైన్‌ ప్రాంతం లో రైల్వేశాఖ సిగ్నల్‌, టెలీ కమ్యూనికేషన్‌ కార్యాలయం, స్టోర్‌ షెడ్‌, అధికా రుల కార్యాలయం, అధికారుల విశ్రాంతి గదులు నిర్మించనున్నారు.

ఆర్‌ఆర్‌ఐ అభివృద్ధికి రూ.40 కోట్లు

అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కొత్తగా ఆర్‌ఆర్‌ఐ(రూట్‌ రిలే ఇంటర్‌లాకింగ్‌ సిస్టం) కార్యాలయాన్ని నిర్మించేందుకు రైల్వేశాఖ రూ.40 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ఉన్న ఆర్‌ఆర్‌ఐ క్యాబిన్‌ కంటే మరింత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కాజీపేటలో చేపట్టనుంది. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆర్‌ఆర్‌ఐ క్యాబిన్‌ నుంచి దాదాపు కాజీపేట రైల్వే జంక్షన్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలోని రైల్వే సిగ్నల్‌ వ్యవస్థ పని చేయనుంది.

20 కోట్లతో బైపాస్‌ లైన్‌ పనులు..

కాజీపేట రైల్వే జంక్షన్‌, టౌన్‌ స్టేషన్‌ల మీదుగా రైళ్ల రాకపోకల దృష్ట్యా బైపాస్‌ లైన్‌ ఏర్పాటుచేసేందుకు రైల్వే శాఖ రూ.20 కోట్లు కేటాయించింది. కాజీపేట మీదుగా బల్లార్ష-విజయవాడ-సికింద్రాబాద్‌ల మధ్య రైళ్ల రాకపోకలతో రద్దీ ప్రస్తుతం విపరీతంగా పెరిగిపోయింది. టౌన్‌ స్టేషన్‌ మీదుగా ప్రతి ఐదు నిమిషాలకు వెళ్లే ప్యాసింజర్‌, గూడ్స్‌ రైళ్ల రాకపోకలను దృష్టిలో పెట్టుకుని హసన్‌పర్తి రోడ్డు నుంచి వరంగల్‌ రైల్వేస్టేషన్‌ వరకు బైపాస్‌ లైన్‌ వేయనున్నారు. బైపాస్‌ లైన్‌ నిర్మాణంలో భాగంగా హసన్‌పర్తి రోడ్‌- వరంగల్‌ రైల్వేస్టేషన్‌ల మధ్య నాలుగు రైల్వే లైన్లు(పట్టాలు) సమానంగా ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. వీటి మధ్య రైల్‌ అండర్‌ రైల్‌ సిస్టమ్‌తో బైపాస్‌ పనులు చేపట్టింది.

అధునాతక సాంకేతికతతో ఆర్వోబీ

కాజీపేట జంక్షన్‌ పరిధిలోని వడ్డేపల్లి ఫిల్టర్‌బెడ్‌ సమీపంలో మరో ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మించేందుకు రూ.12 కోట్లు మంజూర య్యాయి. 2015లో రైల్వే బడ్డెట్‌ సందర్భంగా కాజీపేట జంక్ష న్‌ పరిధిలో ఒక ఆర్వోబీని కేంద్రం మంజూరు చేస్తూ ప్రకటన చేసింది.అయితే నిబంధనల మేరకు బ్రిడ్జి పక్కన మరో స మాంతర బ్రిడ్జిని ఏర్పాటుచేసే అవకాశం ఉండదని రైల్వే ఉన్న తాధికారులు చేతులెత్తారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎంపీలు చొ రవ తీసుకొని నగరం విస్తరిస్తున్నందున కాజీపేటకు మంజూ రుచేసిన ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిని ఏర్పాటుచేయాలని కేంద్రంపై ఒత్తిడి పెంచారు. దీంతో వడ్డెపల్లి ఫిల్టర్‌బెడ్‌ వద్ద  రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఈ వం తెన పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ ఫ్లైఓవర్‌ బ్రిడ్జి (బోస్టరింగ్‌, కస్టింగ్‌ చర్చి) ఫిల్లర్‌ టూ ఫిల్లర్‌ 54మీటర్ల పొడవు తో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించనున్నారు.కొనసాగుతున్న అభివృద్ధి పనులు..

కాజీపేట జంక్షన్‌ పరిధిలో పలు అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. వివిధ పనులు, తనిఖీల కోసం వచ్చే రైల్వే ఉన్నతాధికారులు సేద తీరేందుకు కాజీపేటలో రూ.70 లక్షల వ్యయంతో అధునాతన మౌలిక సదుపాయాలతో విశ్రాంతి భవనం నిర్మిస్తున్నారు. ప్రస్తుతం దీని పనులు 80శాతం పూర్తయ్యాయి. ఫాతిమా ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి సమీపంతో రైల్వే స్థలంలో కోటి రూపాయల వ్యయంతో రైల్వే సిగ్నల్‌, టెలీకమ్యూనికేషన్‌ కార్యాలయం, స్టోర్‌ రూముల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. రైల్వే స్టేషన్‌ సమీపంలో యాభై లక్షలతో డిఫ్యూటీ చీఫ్‌ ఇంజినీర్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్యాలయం నిర్మించారు. వరంగల్‌ రైల్వే స్టేషన్‌-కాజీపేట రైల్వే జంక్షన్ల మధ్య మూడోలైన్‌ పనులు ఊపందుకున్నాయి. కాజీపేట రైల్వే జంక్షన్‌-ఉప్పల్‌ రైల్వే స్టేషన్‌ల మధ్య మూడోలైన్‌ పనులను ఫేస్‌ 2లో చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే పట్టణంలోని మురుగునీరు వడ్డేపల్లి చెరువులోకి చేరకుండా టౌన్‌ రైల్వే స్టేషన్‌ కింది భాగం నుంచి సిద్దార్థనగర్‌ వరకు వెళ్లేందుకు(ఆర్‌యూబీ) రైల్వే అండర్‌ బ్రిడ్జిని రూ.50 లక్షలతో చేపట్టేందుకు రైల్వే శాఖ, కార్పొరేషన్‌ సన్నాహాలు చేస్తున్నది. 

రూపుమారనున్న రైల్వే స్టేడియం

కాజీపేట రైల్వే స్టేడియం పునర్నిర్మాణం కోసం రూ.50 లక్షలు కేటాయించింది. పట్టణం నడిబొడ్డున ఉన్న ఈ స్టేడి యం ఎందరో క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించేలా చేసింది. ప్రస్తుతం శిథిలావస్థకు చేరి అసాంఘిక కార్య కలాపాలకు కేంద్రంగా మారింది. ఈ విషయమై జిల్లా ఎంపీ పసూనూరి దయాకర్‌, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ పలుమార్లు రైల్వే ఉన్నతాధికారులకు విన్న వించడమే గాక కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. రైల్వే బోర్డుకు చేరడంతో స్పందించి పునఃనిర్మాణం కోసం నిధులిచ్చింది.