మంగళవారం 20 అక్టోబర్ 2020
Warangal-city - Aug 10, 2020 , 00:48:14

ప్రజల్లో చైతన్యం తెచ్చేలా వాల్‌ పెయింటింగ్స్‌

 ప్రజల్లో చైతన్యం తెచ్చేలా వాల్‌ పెయింటింగ్స్‌

వరంగల్‌ : నీటిని, కరెంటును ఆదా చేయకుంటే భవిష్యత్‌లో కలిగే నష్టాలు, జీవకోటికి మొక్కలు, చెట్ల ప్రాధాన్యం, ప్లాస్టిక్‌ వాడకంతో కలిగే ఇబ్బందులపై వేసిన వాల్‌ పెయింటింగ్స్‌ ప్రజలను ఆలోచింపజేసేలా ఉన్నాయి. గ్రేటర్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో సుబేదారి వాటర్‌ ట్యాంక్‌ అవరణలో గోడలపై గీసిన బొమ్మలు నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చారిత్రక వరంగల్‌ నగర విశిష్టతను వివరిస్తూనే పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను చాటి చెబుతున్నాయి. కాకతీయ సామ్రాజ్యపు రాణి రుద్రమ దేవి పరాక్రమాన్ని చూపుతూనే నీరు, కరంట్‌ పొదుపు, ప్లాస్టిక్‌ నిషేధం, ‘బేటీ పడావో, బేటీ బచావో’, ‘హరితహారం’ తదితర ప్రభుత్వ పథకాల విశిష్టతను వివరించేలా వేసిన పెయింటింగ్‌లు అబ్బుర పరుస్తున్నాయి. నేటి నిర్లక్ష్యం.. భావితరాలకు కలిగే నష్టాన్ని వివరిస్తూ కళాకారులు వేసిన బొమ్మలు ప్రతి ఒక్కరినీ ఆలోచింప చేస్తున్నాయి. నీటిని పొదుపుగా వాడకుంటే రాబోయే 30 ఏళ్లలో రేషన్‌ షాపుల్లో తాగునీటిని పరఫరా చేసే పరిస్థితి వస్తుందని వేసిన బొమ్మ విశేషంగా ఆకర్షిస్తున్నది.   


logo