మంగళవారం 20 అక్టోబర్ 2020
Warangal-city - Aug 09, 2020 , 00:35:11

సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

సుబేదారి  : ప్రైవేట్‌ రంగాల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వడానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన సందర్భంగా తెలంగాణ ప్రైవేట్‌ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శనివారం హన్మకొండ అదాలత్‌ వద్ద సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యశ్‌పాల్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యమ సమయంలో ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్‌ నెరవేర్చడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో నాయకులు బండారి సరేశ్‌,  భాస్కర్‌రెడ్డి, శోభన్‌,  రవి, సుభాష్‌రెడ్డి, రజినీకాంత్‌, నాగరాజు, రాజేశ్వరీ, దేవిక, అరుణారెడ్డి, విజయ్‌ పాల్గొన్నారు. 


logo