బుధవారం 21 అక్టోబర్ 2020
Warangal-city - Aug 07, 2020 , 03:00:13

తగ్గిన క్రైం రేట్‌

తగ్గిన క్రైం రేట్‌

  •  n అంతర్రాష్ట్ర దొంగలకు చెక్‌
  • n రోడ్డు ప్రమాదాలు అంతంతే
  • n పెరిగిన సైబర్‌ మోసాలు.. కుటుంబ, భూతగాదాలు
  • n పాత దొంగల్లో జంకు..
  • n ఇతర ప్రాంతాల నుంచి కొత్త దొంగలు
  • n నిఘా పెంచిన పోలీసులు
  • n కట్టుదిట్టమైన భద్రతతో సత్ఫలితాలు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాతో పరోక్షంగా నేరాలకు సైతం కళ్లెం పడింది. వైరస్‌ అడ్డుకట్టకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడం, క్రమంగా సడలింపులతో ఎత్తివేయడం, ఈ క్రమంలో పోలీసులు కట్టుదిట్టదైన భద్రతా చర్యలు చేపట్టడం, ప్రజలు సైతం ఇంటి పట్టునే ఉంటుండడంతో నేరాలు చాలామటుకు తగ్గినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. పీడీ యాక్టులతో పాత దొంగలు జంకుతుండగా, జల్సాలకు అలవాటు పడిన పలువురు యువకులు కొత్త చోరులుగా అవతారమెత్తారు. అంతర్రాష్ట్ర దొంగలకు దారులు మూసుకుపోగా, సైబర్‌ నేరగాళ్లు మాత్రం రెచ్చిపోయారు. అక్కడక్కడా కుటుంబ, భూతగాదాలు మినహా రోడ్డు ప్రమాదాలు, హత్యలు, లైంగిక దాడులు తగ్గిపోయాయి.   

- వరంగల్‌ ప్రతినిధి/ములుగు/జనగామ క్రైం/భూపాలపల్లి

క్రైం రేట్‌ చాలా తగ్గింది


చిన్నచిన్న గొడవలు మినహా నేరాలు చాలా తగ్గుముఖం పట్టాయి. కరోనా సమయంలో ఆస్తుల చోరీలు పూర్తిగా తగ్గాయి. రోడ్డు ప్రమాదాలు కూడా పెద్దగా లేవు. లాక్‌డౌన్‌, పోలీసులు తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యలతో గతంతో పోలిస్తే క్రైం రేటు తగ్గింది. 

- సీపీ ప్రమోద్‌కుమార్‌

(వరంగల్‌ ప్రతినిధి/ జనగామ క్రైం/భూపాలపల్లి/ములుగు) : కరోనా వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను విధించింది. దీన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు పోలీసు శాఖ కీలకంగా వ్యవహరించింది. కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూనే మరోవైపు శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల అదుపు విషయంలో పకడ్బందీ చర్య లు తీసుకున్నది. ఫలితంగా నేరాల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. వరంగల్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంతకుముందున్న  నేరాలు గణనీయంగా తగ్గాయని రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. కరోనాపై విస్తృత అవగాహన అన్ని స్థా యిల్లో పెరగడంతో ప్రజలు ఇంటిపట్టునే ఉంటున్నారు.  ఇదే క్రమంలో నేరాలకు పాల్పడేవారు సై తం కరోనా భయంతో  పంథాను మార్చుకున్నా రు. రవాణా, ప్రయాణాలు సాగని పరిస్థితి నెలకొని అంతర్రాష్ట్ర దొంగల ముఠాలకు దారులు మూసుకుపోయాయి.  ఇటు వరుస దొంగతనాల కు పాల్పడేవారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మో పింది. కఠినమైన పీడీ యాక్టులు పెడుతూ కట్టడి చేసింది. దీంతో పాత దొంగలు సైలెంట్‌ కాగా లా క్‌డౌన్‌లో జల్సాలకు అలవాటు పడిన పలువురు యువకులు ఈజీ మనీ కోసం దొంగతనాలను ఎంచుకున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో మద్యం షాపుల్లో దొంగతనాలు వెలుగుచూశాయి. జనగామలో జనరల్‌ స్టోర్‌లో సబ్బుల కాటన్స్‌ను ఎత్తుకెళ్లిన వైనాలు కనిపించాయి. వరంగల్‌ పోలీస్‌  కమిషనరేట్‌ పరిధిలోని మూడు జిల్లాల్లో స్థల వి వాదాలు, కుటుంబ గొడవలు మినహా రోడ్డు ప్ర మాదాలు, దొంగతనాలు, అత్యాచారాలు చాలా మటుకు తగ్గాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ ఇంటిపట్టునే ఉండడం, విద్యా సంస్థలు మూసి ఉండడం, ఒకవేళ తల్లిదండ్రులు పనులకు వెళ్లినా పిల్లలు ఇళ్లల్లోనే ఉండడంతో పగటిపూట దొంగతనాలకు తావులేకుండా పోయింది. ఇక మహిళలు ఎక్కువ బయటకు వెళ్లని మూలంగా చైన్‌స్నాచింగ్‌లకు కళ్లెం పడింది. 

పెరిగిన భూ తగాదాలు..

లాక్‌డౌన్‌తో ఇతర రాష్ర్టాలు, నగరాలు, పట్టణాల నుంచి చాలామంది పనుల్లేక స్వగ్రామాలకు చేరుకున్నారు. ఈ క్రమంలో వీరంతా తమకున్న కొద్దిపాటి వ్యవసాయ క్షేత్రాల్లో పంటల సాగుకు సన్నద్ధమయ్యారు. పల్లెల్లో వ్యవసాయ భూములకు సంబంధించి పొరుగు వారితో గతంలో ఉన్న గెట్టు పంచాయతీలు, అన్నదమ్ములు, పాలోళ్ల భూతగాదాలు మళ్లీ తెరపైకి వచ్చాయి.

సైబర్‌ నేరాలు.. 

చైన్‌స్నాచింగ్స్‌, దారిదోపిడీలు, చోరీలు తగ్గినా ఇదే సమయంలో ఆన్‌లైన్‌ మోసాలు పెరిగాయి. అత్యాశకుపోయి ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసి తీరా భారీ మొత్తంలో నష్టపోయాక పోలీస్‌ స్టేషన్లకు వచ్చే వారి సంఖ్య ఇటీవల పెరిగింది. మరోవైపు ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌లోనూ ఇలాంటి ట్రెండ్‌ కనిపిస్తున్నదని ఆయా ఠాణాలకు వస్తున్న ఫిర్యాదులు స్పష్టం చేస్తున్నాయి. ఫోన్‌ నంబర్‌కు లాటరీ తగిలిందని, లేదా బహుమతి వచ్చిందని, ఫలానా ఖాతాలో రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లిస్తే అందిస్తామని, ఏటీఎం కార్డు బ్లాక్‌ అయిందని సైబర్‌ నేరగాళ్లు అమాయకులను బుట్టలో వేసుకొని కొల్లగొట్టిన దాఖలాలున్నాయి. 

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 2019లో ఇండ్లల్లో చోరీలు -11, దారి దోపిడీలు-2,  మా మూలు దొంగతనాలు  22, హత్యలు-8, అత్యాచారాలు-2 నమోదు కాగా, రూ.23.98 లక్షల సొత్తు అపహరణకు గురైంది. 2020 మార్చి నుం చి జూలై వరకు ఇండ్లలో చోరీలు -7, దారి దోపిడీ-1, మామూలు దొంగతనాలు-13, హత్య కేసులు-7 నమోదు కాగా,  రూ.8.40 లక్షలు అపహరణకు గురైనట్లు పోలీసులు రికార్డులు చెబుతున్నాయి. 

ములుగు జిల్లాలోని 10 పోలీస్‌స్టేషన్ల పరిధిలో గతం కంటే క్రైం రేట్‌ సగానికి తగ్గింది. అన్ని ఠాణా ల్లో మార్చి నుంచి జూలై వరకు 704 కేసులే నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ప్రజల అలవాట్లలో మార్పుల వల్లే క్రైం రేట్‌ తగ్గిందని స్పష్టం చేశారు. క్రైం రేటు తగ్గుముఖం పట్టడంతో పోలీసులు సై తం తమ విధి నిర్వహణలో ఒత్తిడికి గురికాకుండా ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్నారు.  

జనగామలో 2019   2020(ఏడు నెలల్లో)

మర్డర్లు         14 2
హత్యాయత్నాలు 16 10
పగటిపూట చోరీలు    15 2
రాత్రిపూట చోరీలు    44 10
సాధారణ చోరీలు    61 25
పశువుల దొంగతనాలు 10 3
దొమ్మీలు     35 12
మోసాలు             141 38
కిడ్నాప్‌లు     48 26
రేప్‌ కేసులు     16 3
సాధారణ ప్రమాదాలు  218 78
రోడ్డు ప్రమాద మరణాలు 125 75
భూతగాదాలు             686 524
ఆత్మహత్యలు 298 141
మిస్సింగ్‌లు     139 66


logo