మంగళవారం 20 అక్టోబర్ 2020
Warangal-city - Aug 04, 2020 , 10:31:17

ప్రగతిభవన్‌లో రాఖీ పండుగ

ప్రగతిభవన్‌లో రాఖీ పండుగ

రాఖీ పండుగను పురస్కరించుకుని సోమవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌కు మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎంపీ కవిత, వరంగల్‌ రూరల్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి, టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు గుండా సుధారాణి   రాఖీ కట్టారు. ఈ సందర్భంగా వారికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వర్ధన్నపేట మండలం కట్య్రాల ఎంపీటీసీ చొల్లేటి ప్రవీణ్‌రెడ్డి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటికి వెళ్లగా ఆమె ఆయనకు రాఖీ కట్టారు. 

- వరంగల్‌ రూరల్‌, నమస్తే తెలంగాణ/ మహబూబాబాద్‌/ వరంగల్‌/ వర్ధన్నపేట logo