బుధవారం 21 అక్టోబర్ 2020
Warangal-city - Aug 04, 2020 , 10:27:22

గోవధకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్‌

గోవధకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్‌

  • n మారణాయుధాలు, రెండు ట్రక్కులు, ద్విచక్రవాహనాలు స్వాధీనం 
  • n ఇన్‌చార్జి ఏసీపీ జితేందర్‌ వెల్లడి 

హసన్‌పర్తి/వరంగల్‌ క్రైం : గోవులు, ఎద్దులను వధించి, వాటి మాంసాన్ని విక్రయిస్తున్న పది మంది సభ్యుల ముఠాను సోమవారం హసన్‌పర్తి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి గోవులు, ఎద్దులను వధించేందుకు వినియోగించిన మారణాయుధాలు, రెండు ట్రక్కులు, రెండు ద్విచక్రవాహనాలను  చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌లో కాజీపేట ఇన్‌చార్జి ఏసీపీ జితేందర్‌రెడ్డి సోమవారం వెల్లడించారు. మండలంలోని అర్వపల్లికి చెందిన షేక్‌ చిన్నలాల్‌ ఆలియాస్‌ అక్బర్‌, షేక్‌ కరీం అలియాస్‌ హైదర్‌ బక్రీద్‌ పండుగ సందర్భంగా గోవులు, ఎద్దులను వధించి వాటి మాంసాన్ని ట్రైసిటీ పరిధిలో విక్రయించి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలనే ప్రణాళికను రూపొందించుకున్నారు. వీరు గత నెల 15న ములుగు జిల్లా ఇంచెర్ల గ్రామానికి చెందిన భద్రయ్యను పరిచయం చేసుకుని, అతడి సహకారంతో జంగాలపల్లి సంత నుంచి ఆరు ఆవులు, ఆరు ఎద్దులు కొనుగోలు చేశారు. వాటిని గత నెల 19న ములుగు జిల్లాకు చెందిన  రాజేందర్‌ తన బోలెరో ట్రక్‌లో రహస్యంగా హసన్‌పర్తి మండలం అర్వపల్లి గ్రామానికి తరలించాడు.  షేక్‌ చిన్నలాల్‌, షేక్‌ కరీం ఇంటి వద్ద ఉన్న మరో మూడు ఎద్దులను వధించేందుకు సిద్ధపడ్డారు. ఈ మేరకు ఈ నెల ఒకటిన అర్వపల్లి శివారులోని రహస్య ప్రాంతంలో గోవులు, ఎద్దులను వధించారు. వాటి మాంసాన్ని ట్రాలీ, ఆటోలు, కార్ల ద్వారా వరంగల్‌, హన్మకొండ, కాజీపేటలోని పలు ప్రాంతాలకు తరలిస్తుండగా హసన్‌పర్తి పోలీసులకు సమాచారం అందడంతో దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించడంతో నేరాన్ని అంగీకరించారు. ఈ మేరకు అర్వపల్లికి చెందిన షేక్‌ చిన్నలాల్‌, షేక్‌ కరీం, షేక్‌ పెద్ద రసూల్‌, షేక్‌ బాషా, షేక్‌ గోరేమియా, సయ్యద్‌ బడేసాబ్‌తో పాటు ములుగు జిల్లాకు చెందిన భద్రయ్య, ఉప్పు రాజేందర్‌, వరంగల్‌కు చెందిన సయ్యద్‌ ముస్లేహుద్దీన్‌, ఎండీ సయ్యద్‌ను అరెస్టు చేశారు.  గోవధకు పాల్పడుతున్న నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబర్చిన హసన్‌పర్తి ఇన్‌చార్జి  ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌జీ, ఎస్సై పవన్‌కుమార్‌తో పాటు పోలీసు సిబ్బందిని  సీపీ ప్రమోద్‌కుమార్‌ అభినందించారు. చట్ట వ్యతిరేకంగా ఎవరైనా గోవులు, ఎద్దులను వధిస్తే  తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.


logo