శనివారం 08 ఆగస్టు 2020
Warangal-city - Aug 02, 2020 , 08:38:15

ఆలోచింపజేసే ఆర్టిస్ట్‌ రమేశ్‌ చిత్రం

ఆలోచింపజేసే ఆర్టిస్ట్‌ రమేశ్‌ చిత్రం


వరంగల్‌ కల్చరల్‌, ఆగస్టు 1 : ఒకవైపు కరోనా వైరస్‌, మరోవైపు మిడతల దండు జనాలను ఏవిధంగా చుట్టుముడుతున్నాయో తన చిత్రంతో హృద్యంగా వివరించిన ప్రముఖ చిత్రకారుడు దేవరాయి రమేశ్‌కు అంతర్జాతీయ అవార్డు లభించింది. హన్మకొండ గోపాలపురానికి చెందిన ఆర్టిస్ట్‌ రమేశ్‌ ఏటూరునాగారం చిన్నబోయినపల్లి ఆశ్రమ పాఠశాలలో డ్రాయింగ్‌ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఇండియన్‌ రాయల్‌ అకాడమీ ఆర్ట్స్‌ అండ్‌ కల్చర్‌ సంస్థ కొవిడ్‌ -19 పై అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో రమేశ్‌ వేసిన చిత్రానికి బెస్ట్‌ ఎంట్రీ అవార్డు లభించినట్లు శనివారం ఆయన తెలిపారు. చెట్లను నరకడం, వాతావరణ కాలుష్యం వంటి మానవ తప్పిదాలతోనే.. కరోనా, మిడతల దాడి వంటి విపత్తులు వెల్లువెత్తుతున్నాయని.. పోలీసులు, డాక్టర్లు సామాజిక దృక్పథం కలిగిన వారు భూమిని రక్షించేందుకు శాయశక్తులా శ్రమిస్తున్నారని.. అర్థవంతంగా రమేశ్‌ గీసిన చిత్రం.. అవార్డును సొంతం చేసుకోవడమే కాకుండా పలువురుని ఆలోచింపజేసే విధంగా ఉంది.logo