బుధవారం 28 అక్టోబర్ 2020
Warangal-city - Aug 02, 2020 , 08:38:15

గ్రామాలను బాలమిత్రగా తీర్చిదిద్దాలి

గ్రామాలను బాలమిత్రగా తీర్చిదిద్దాలి

  • n రాష్ట్ర ప్రణాళికా సంఘం  వైస్‌చైర్మన్‌ వినోద్‌కుమార్‌
  • n సర్పంచ్‌, ఎంపీటీసీ,  జడ్పీటీసీలకు లేఖ

రెడ్డికాలనీ, ఆగస్టు 1 : ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ప్రతి గ్రామాన్ని బాలమిత్ర గ్రామంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌ సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీలకు పిలుపునిచ్చారు. కొవిడ్‌-19 ఒక దురదృష్టకరమైన సమస్య అని, ఈ వైరస్‌ ప్రభావం అట్టడుగున ఉన్న పి ల్లలపై పడకుండా చూసే బాధ్యత ప్రతి ఒ క్కరిపై ఉందని అభిప్రాయపడ్డారు. కొవి డ్‌ సమస్య వల్ల పిల్లల భద్రత నిర్వీర్యం కాకుండా ప్రతి ఒక్కరూ నిర్విరామంగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొవిడ్‌తో ఉపాధి కోల్పోయి పేద కుటుంబాల ఆర్థిక పోషణ కష్టతరం కావడం వల్ల ఆ భారం పేద పిల్లలపై పడే అవకాశా లు చాలా ఎ క్కువగా ఉ న్నాయన్నారు. పిల్లల్లో మానసిక ఒత్తిడి పెరిగిపోతున్నదని, బాల్య వివాహాలు జ రుగుతున్నాయని, బాల కార్మికులుగా మారిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశా రు. పిల్లల సమస్యలు పెరగకుండా ఉండటానికి గ్రామాల ప్రజాప్రతినిధులు తగిన కృషి చేయాలన్నారు. బాల కార్మికులు, బాల్య వివాహాలు జరగని గ్రామాలుగా తీర్చిదిద్దుదామన్నారు. ప్రతి ఒక్కరూ కొంత సమయాన్ని కేటాయించి కొంతమంది బాలలకు విద్యను అందించే వి ధంగా గ్రామాల్లో కృషి చేయాలన్నారు. 


logo