ఆదివారం 25 అక్టోబర్ 2020
Warangal-city - Aug 01, 2020 , 02:00:19

ఓజో‘నిట్‌' ఫ్రిడ్జ్‌

ఓజో‘నిట్‌' ఫ్రిడ్జ్‌

  • నిట్‌ వరంగల్‌లో సరికొత్త  ఆవిష్కరణ
  • కూరగాయలు, వస్తువులపై కరోనా నివారణకు ఫ్రిడ్జ్‌
  • ఓజోన్‌ వాయువుతో వైరస్‌కు చెక్‌

 నిట్‌క్యాంపస్‌, జూలై31: కరోనా కట్టడికి అనేక ప్ర యోగాలు జరుగుతున్న వేళ నిట్‌ వరంగల్‌ వైరస్‌ వ్యాప్తి నిరోధకానికి ఓజోనిట్‌ ఫ్రిడ్జ్‌ అనే సరికొత్త పరికరాన్ని ఆవిష్కరించింది. ఫ్రిడ్జ్‌ లాంటి పరికరంలో 20 నుంచి 25 నిమిషాల వరకు ఓజోన్‌ వాయువును ఉంచాలి. దీంతో అందులో ఉన్న నిత్యావసర సరుకు లు, కూరగాయలపై 99.99 శాతం అన్ని రకాల వైరస్‌లు తొలగిపోతాయని నిట్‌ ఫిజిక్స్‌ ప్రొఫెసర్లు పే ర్కొంటున్నారు.

భౌతికశాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్‌ దినకర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ డీ హరనాథ్‌ ఓజోనిట్‌ పేరుతో బహుళార్థక స్టెరిలైజేషన్‌ పరికరాన్ని కనుగొన్నారు. కరోనా వ్యాప్తి వాహకాలైన కూరగాయలు, పండ్లు, పాలు, ఆభరణాలు, సె ల్‌ఫోన్లు, వాచ్‌లు, బట్టలు, పత్రికలు, డెలివరీ ప్యాకింగ్‌లు.. ఇలా అన్నీ కేవలం కొద్ది సమయంలోనే వైరస్హ్రితం చేసు కోవచ్చని తెలిపారు. వీటిల్లో ఉండే అన్ని రకాల వైరస్‌లతోపాటు ఫంగస్‌, బ్యాక్టీరియాలను రసాయనరహితంగా శుభ్రం చేయడం దీని ప్రత్యేకత అని ప్రొఫెసర్‌ దినకర్‌ తెలిపారు. అతినీలలోహిత కిరణాల కంటే జోన్‌ పంపిం గ్‌  విధానంలో అన్ని మూలలను శభ్రం చేసి రుచి, నాణ్యతతో కూరగా యలను అందిస్తుందని వివరించారు. ఈ ఫ్రిడ్జ్‌ను పూర్తిస్థాయిలో తయారుచేసి మార్కెట్‌లోకి తీసుకువస్తామని వారు స్పష్టం చేశారు. నిట్‌ అధ్యాపకు ల ఆవిష్కరణలపై డైరెక్టర్‌ ఎన్వీ రమణారావు సంతోషం వ్యక్తం చేశారు. 


logo