గురువారం 13 ఆగస్టు 2020
Warangal-city - Aug 01, 2020 , 01:49:34

చివరి మజిలీకిబల్దియా భరోసా

చివరి మజిలీకిబల్దియా భరోసా

  • కరోనా మృతుల అంతిమ సంస్కారాలకు గ్రేటర్‌ కార్పొరేషన్‌ ఏర్పాట్లు
  • దహనానికి రూ.10లక్షలతో తొలి ఆధునిక యంత్రం
  • పోతన శ్మశాన వాటికలో మరో పదిరోజుల్లో అందుబాటులోకి
  • 45 నిమిషాల్లోనే దహనం
  • కమిషనర్‌ పమేలా సత్పతి ప్రత్యేక శ్రద్ధ         

వరంగల్‌ : కరోనా వైరస్‌తో మృతిచెందిన వారి అంతిమ సంస్కారాల కోసం బల్దియా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. ద హనాల కోసం రూ.10లక్షలతో తొలిసారిగా ఆధునిక యం త్రాన్ని కొనుగోలు చేసింది. నగరంలోని పోతన శ్మశాన వాటికలో మరో పది రోజుల్లో దీనిని అందుబాటులో ఉంచుతామని కార్పొరేషన్‌ అధికారులు వివరించారు. మూడు రోజులుగా కమిషనర్‌ పమేలా సత్పతి ప్రత్యేక శ్రద్ధతో అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు.  

బాధ్యత బల్దియా భుజాన..

కరోనా మృతుల అంతిమ సంస్కారాలు పెద్ద సమస్యగా మారి బాధిత కుటుంబాలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో బల్దియానే ఆ బాధ్యతను భుజాన వేసుకుంది. ఇప్పటికే కమిషనర్‌ పోతన శ్మశాన వాటికకు వెళ్లి పరిశీలించారు. దీంతో శుక్రవారం బల్దియా అధికారులు 8 మృతదేహాలకు దహన సంస్కారాలు చేశారు. 12 మందితో ప్రత్యేక బృందా న్ని ఏర్పాటు చేయడంతోపాటు మృతదేహాల తరలింపు కోసం అంబులెన్స్‌ను కొనుగోలు చేశారు. శ్మశానవాటికలో ఆధునిక దహన యంత్రాన్ని అమర్చేందుకు ఇంజినీరింగ్‌ అ ధికారులు ప్లాట్‌ ఫాం నిర్మాణ చర్యలు చేపట్టారు. మరో వా రంలో యంత్రం వస్తుందని, రెండు రోజుల్లో ఫిట్టింగ్‌ పూర్తవుతుందన్నారు. ప్రత్యేకంగా గదులు నిర్మిస్తున్నట్లు చెప్పారు.  

45 నిమిషాల్లోనే దహనం.. 

‘ఈ యంత్రం ద్వారా 45 నిమిషాల్లోనే దహనం పూర్తవుతుంది. ఇది ఎల్‌పీజీ ద్వారా పని చేస్తుంది. నిర్వహణ ఖ ర్చు తక్కువ ఉంటుంది. ఒక్క మృతదేహం దహనానికి సగం సిలిండర్‌ గ్యాస్‌ సరిపోతుంది’ అని అధికారులు చెప్పారు.   

కమిషనర్‌ ప్రత్యేక చొరవ..

కరోనా మృతదేహాల అంతిమ సంస్కారాల కోసం కార్పొరేషన్‌ కమిషనర్‌ పమేలా సత్పతి ప్రత్యేక చొరవతో ఈ యం త్రాన్ని తెప్పిస్తున్నారు. అంతిమ ప్రక్రియ సాఫీగా జరిగేలా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇద్దరు వింగ్‌ అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. అంతిమ సంస్కారాల్లో వారి వారి సంప్రదాయాలను పాటించాలని  సూచించారు. రోజూ వారీ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.


తాజావార్తలు


logo