మంగళవారం 20 అక్టోబర్ 2020
Warangal-city - Jul 31, 2020 , 00:42:41

రాష్ట్రవ్యాప్తంగా కరోనా నివారణ రుద్రాభిషేకాలు

రాష్ట్రవ్యాప్తంగా కరోనా నివారణ రుద్రాభిషేకాలు

  • తెలంగాణ అర్చక సమాఖ్య  రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఉపేంద్రశర్మ

రెడ్డికాలనీ, జూలై 30: రాష్ట్రవ్యాప్తంగా శ్రావణ శుద్ధ ఏకాదశి గురువారం అర్చకులు కరోనా వ్యాధి నివారణ పూజలు నిర్వహించినట్లు తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. లోక కల్యాణార్థం రుద్రాభిషేకాలు నిర్వహించారు. సమస్త మానవాళిని రక్షించాలని, మనోధైర్యంతో, శివ పంచాక్షరి జరిపిస్తుండడం వల్ల శారీరక బాధలు తొలగిపోతాయని, సమాజ శ్రేయస్సు కోసం అర్చక సమాఖ్య రాష్ట్రవ్యాప్తంగా విస్తృతమైన సేవలందిస్తుందన్నారు. శ్రావణ మాసం చివరి శనివారం రోజున విష్ణు ఆలయాల్లో కూడా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలోని రుద్రేశ్వర స్వామికి, గణపతి ప్రార్థన అనంతరం ఆలయ వేద పండితులు గంగు మణికంఠశర్మ వేదోక్తంగా వేద పఠనం, రుద్రాభిషేకం నిర్వహించినట్లు తెలిపారు.logo