సోమవారం 19 అక్టోబర్ 2020
Warangal-city - Jul 30, 2020 , 01:26:53

పెళ్లికి క‌ళ్లెం

పెళ్లికి క‌ళ్లెం

  • n వివాహ వేడుకలకు తహసీల్దార్‌ అనుమతి తప్పనిసరి
  • n కరోనా కారణంగా 20మందికే కుదింపు
  • n అతిక్రమిస్తే కఠిన చర్యలు

కాజీపేట : అశేష బంధుగణంతో వారం దాకా సందడిగా సాగే పెళ్లి వేడుకలకు కరోనా పుణ్యమా అని కళ్లెం పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో పెళ్లిళ్లకు తహసీల్దార్‌ అనుమతి తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు తేడాలేకుండా అందరు ఖచ్చితంగా ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక నుంచి పెళ్లికి కేవలం 20 మందికి మించి హాజరు కాకుండా చూసుకోవాలి. నిన్నమొన్నటిదాకా పెళ్లికి 50 మందికి అనుమతి ఉన్నా కరోనా నానాటికీ విజృంభిస్తున్న నేపథ్యంలో నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ సంఖ్యను 20మందికే కుదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఇరువర్గాల నుంచీ ఈ సంఖ్యకు మించకుండా హాజరుకావాల్సి ఉంటుంది. బంధు మిత్రులను పిలువకుండానే కేవలం ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలోనే పెళ్లి తంతు జరిపించాల్సి ఉంటుంది. ఈ ఆదేశాలు వధూ, వరుల కుటుంబాలకు మింగుడు పడకుండా ఉన్నా, కరోనా వ్యాప్తికి అవకాశం ఇవ్వరాదనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా సామూహిక కార్యక్రమాలతో కరోనా విజృభించే అవకాశాలుండడంతో ప్రజలు సైతం భయపడుతున్నారు. బంధు మిత్రులు లేకుండా పెళ్లి ఎలా అనుకుంటున్న కుటుంబాలు తాత్కాలికంగా వివాహాలను వాయిదా వేసుకుంటున్నాయి. ఈ నిబంధన ప్రస్తుత పరిస్థితుల్లో అనివార్యమని వైద్యులు సైతం స్పష్టం చేస్తున్నారు. ఇప్పటి దాకా పెళ్లి అనుమతి బాధ్యతలు  కలెక్టర్‌కు ఉండగా ప్రభుత్వం తాగాజా తహసీల్దార్‌కు అప్పగించింది. శ్రావణ మాసం ఆరంభంలో పెళ్లిళ్లకు ముహూర్తాలు ఖరారు కావడంతో చాల మంది అనుమతి ఎలా తీసుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. 

అనుమతులు ఇలా..

  • r వివాహ ఆహ్వాన పత్రికతో పాటు అనుమతి కోరేవారు పది రూపాయల నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంప్‌పై ఆఫిడవిట్‌ను మండల తహసీల్దార్‌కు సమర్పించాలి. 
  • r దరఖాస్తు చేసుకునేవారు ఆధార్‌కార్డులతో పాటు కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు వైద్యులు ఇచ్చిన ధ్రువీకరన పత్రాలు జతచేయాలి. 
  • r నిబంధనలను ఉల్లంఘిస్తే జాతీయ విపత్తు నిర్వహణ చట్టం 2005లోని సెక్షన్‌ 188 ద్వారా కఠిన చర్యలు తీసుకుంటారు. 

‘మాస్కులు తప్పక ధరించండి’.. పెళ్లి పత్రికపై ముద్రణ

కరీమాబాద్‌ : పెళ్లి పత్రికపై ఆహ్వానించేవారు, వధువు, వరుడి పేర్లు, అడ్రస్‌ మాత్రమే ముద్రిస్తారు. కానీ మారిన కరోనా కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పెళ్లికి ‘మాస్కులు తప్పక ధరించండి.. సోషల్‌ డిస్టెన్స్‌ పాటించండి” అంటూ ఏకంగా కార్డులపై ముద్రించి పంపిణీ చేస్తున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటలో ఓ కుటుంబం ఇలా పెళ్లి పత్రికపై ప్రింట్‌ వేయించి బంధుమిత్రులకు పంచింది. 

వధూవరులకు కానుకగా మాస్క్‌లు, శానిటైజర్‌ 

ఏటూరునాగారం : మండల కేంద్రంలోని రెండో వార్డులో బుధవారం ఓ జంట వివా హం కాగా, పంచాయితీ కో అప్షన్‌ సభ్యుడు ముస్తఫా వధూవరులకు మాస్క్‌లు, శానిటైజర్లు అందించి శుభాకాంక్షలు తెలిపారు. పెళ్లిళ్లకు బహుమతులు ఇవ్వడం సహజం కానీ, ఇలా కరోనా నివారణపై సామాజిక స్పృహతో ప్రజల్లో చైతన్యం కలిగించేలా మాస్క్‌లు, శానిటైజర్‌ను కానుకగా ఇవ్వడాన్ని స్థానికులు అభినందించారు.  


logo