ఆదివారం 25 అక్టోబర్ 2020
Warangal-city - Jul 30, 2020 , 01:01:31

ఎంజీఎంలో మ‌రిన్ని వ‌స‌తులు

 ఎంజీఎంలో మ‌రిన్ని వ‌స‌తులు

 • n  ‘కొవిడ్‌-19’ విభాగం సేవల విస్తరణ
 • n  మరో 250 పడకలతో బ్లాక్‌కు ఏర్పాట్లు
 • n ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధులు, అధికారుల సమీక్ష
 • n యుద్ధప్రాతిపదికన సౌకర్యాల కల్పన
 • n అదనపు వెంటిలేటర్లు, యంత్ర పరికరాలకు మంత్రి హామీ
 • n శాఖాపరమైన చర్యలకు ఆదేశాలు

ఆపన్నులకు ఆయువుపట్టులా నిలిచిన వరంగల్‌ ఎంజీఎం దవాఖానలో ‘కొవిడ్‌-19’ సేవల విస్తరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇక్కడ ఇదివరకే 200పడకలతో ప్రత్యేక విభాగం ఉండగా, రోజురోజుకూ కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో మరో 250 పడకలతో బ్లాక్‌ ఏర్పాటు కోసం అధికారయంత్రాంగం యుద్ధప్రాతిపదికన కదులుతున్నది. ఎప్పటికప్పుడు మంత్రులు ఈటల రాజేందర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షిస్తూ కరోనా వైద్య సేవలందించేందుకు కావాల్సిన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారు. మరిన్ని వెంటిలేటర్లు, యంత్ర పరికరాలను సమకూరుస్తామని హామీ ఇచ్చారు. 

    వరంగల్‌ చౌరస్తా : ఉత్తర తెలంగాణ పాలిట వరప్రదాయనిగా ఉన్న వరంగల్‌ ఎంజీఎం దవాఖానలో ‘కొవిడ్‌- 19’ విభాగం సేవల విస్తరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. కరోనా బా ధితులకు వైద్యసేవలందించేందుకు ముందస్తు చ ర్యల్లో భాగంగా మార్చి మొదటి వారంలో మా తా, శిశు సంరక్షణ విభాగ భవనంలో 25 పడకల తో కొవిడ్‌ విభాగాన్ని ఏర్పాటు చేశారు. అనంత రం 200 పడకలకు విస్తరించి వైద్యసేవలందిస్తున్నారు. రోజురోజుకూ బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో మరిన్ని పడకలు పెంచాల్సిన అవస రం ఏర్పడింది. దీంతో ఎంజీఎం, జిల్లా వైద్య, ఆ రోగ్యశాఖ అధికారులు ఈ విషయాన్ని మంత్రు లు ఈటల, ఎర్రబెల్లి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేర కు హంటర్‌రోడ్డులోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, ఎంజీఎం అధికారులతో మం త్రులు రాజేందర్‌, దయాకర్‌రావు మంగళవారం సమీక్ష నిర్వహించారు. కొవిడ్‌ సేవలకు అదనంగా మరో 250 పడకలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటితో పాటు కావాల్సిన యంత్ర పరికరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఎంజీఎంలో మరో 250 పడకలతో కొవిడ్‌ వార్డును విస్తరించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు.

పరిశీలనలో ఆర్‌ఐసీయూ, పీఎంఎస్‌ఎస్‌వై సూపర్‌ స్పెషాలిటీ భవనం..

ఆర్‌ఐసీయూ విభాగ భవనం లేదా, పీఎంఎస్‌ఎస్‌వై సూపర్‌ స్పెషాలిటీ వైద్యశాల భవనంలో 250 పడకల ఏర్పాటు కోసం అధికారులు పరిశీలిస్తున్నారు. ఎంజీఎంలోని ఆర్‌ఐసీయూ భవనం లో హృద్రోగులకు, డయాలసిస్‌ రోగులకు వైద్యసేవలందిస్తున్నారు. ప్రస్తుతం ఈ భవనంలో అన్ని రకాల యంత్ర పరికరాలను ఏర్పాటు చేసుకునే వీలుంది. దీనికి తోడు ప్రస్తుతం అన్ని వసతులూ కలిగి  పీఎంఎస్‌ఎస్‌వై వైద్యశాల భవనం సైతం అందుబాటులో ఉండడంతో ఈ రెండింటిలో ఏ దో ఒకదానిని పూర్తిస్థాయి ‘కొవిడ్‌-19 విభాగం’ గా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొవిడ్‌ ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తే ఎంజీఎంలో ప్ర స్తుతం నిలిపివేసిన అన్ని రకాల వైద్యసేవలను య థావిధిగా అందుబాటులోకి తెచ్చే వీలుకలుగుందని అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. 

యంత్ర పరికరాలకు మంత్రుల హామీ..

కరోనా బాధితులకు వెంటిలేటర్లను అందిస్తామని సమీక్షలో మంత్రులు ఈటల, ఎర్రబెల్లి హా మీ ఇచ్చారు. ప్రస్తుతం కొవిడ్‌ విభాగంలో అందుబాటులో ఉన్న వెంటిలేటర్లతోపాటు మరిన్ని అం దుబాటులోకి తేనున్నారు. వీటికితోడు కావాల్సిన యంత్ర పరికరాలను కూడా సమకూర్చనున్నారు.

నగర బల్దియా భరోసా   


  • కరోనా మృతులకు ప్రత్యేక శ్మశాన వాటికలు
  • n అంత్యక్రియలు సాఫీగా చేసేందుకు బృందం 
  • n మృతదేహల తరలింపు కోసం అంబులెన్స్‌ 
  • n కార్పొరేషన్‌ సిబ్బంది 
  • హోంక్వారంటైన్‌ కోసం గెస్ట్‌హౌస్‌
  • n సమావేశంలో కమిషనర్‌ పమేలా సత్పతి

  వరంగల్‌ : కరోనా మృతుల దహన సంస్కారాలకు అడుగడునా అడ్డంకులు ఎదురవుతున్న తరుణంలో మృతుల కుటుంబాలకు నగర బల్దియా భరోసాగా నిలిచింది. గ్రేటర్‌ కార్పొరేషన్‌ పరిధిలో కరోనాతో చనిపోయిన వారి దహన సంస్కారాల కోసం ప్రత్యేక శ్మశాన వాటికల ఏర్పాటుకు సిద్ధమైంది. అనేక చోట్ల కరోనా మృతుల అంతిమ సంస్కారాల విషయంలో ప్రజల నుంచి అభ్యంతరాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్న క్రమంలో బల్దియానే అంతిమ ఏర్పాట్ల బాధ్యతలు చేపట్టేందుకు ముందుకొచ్చింది. మృతులను తరలించేందుకు ప్రత్యేకంగా అంబులెన్స్‌ను ఏర్పాటు చేస్తున్నది. అంత్యక్రియలు సాఫీగా చేయించేందుకు 12 మంది బల్దియా సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. అంతిమ సంస్కారాల్లో ఈ ప్రత్యేక బృందం కుటుంబసభ్యులకు సహకారమందించనుంది. ఈ మేరకు గ్రేటర్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ పమేలా సత్పతి బుధవారం అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తక్షణమే ప్రత్యేక శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

  మూడు శ్మశాన వాటికలు..

  గ్రేటర్‌ కార్పొరేషన్‌ పరిధిలో కరోనా వైరస్‌తో మృతి చెందిన వారి దహన సంస్కారాల కోసం మూడు ప్రత్యేక శ్మశాన వాటికలు ఏర్పాటు చేయనున్నారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌ మతాలవారికి వేర్వేరు శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని కమిషనర్‌ సూచించారు. నగరంలోని పలు శ్మశాన వాటికల్లో కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు చేయకుండా స్థానికులు అడ్డుకుంటున్న పరిస్థితుల్లో ఈ చర్యలు తీసుకుంటున్నారు. 

  మృతదేహాల తరలింపునకు ప్రత్యేక అంబులెన్స్‌

  కరోనా మృతులను తరలించేందుకు ప్రత్యేక అంబులెన్స్‌ను సైతం బల్దియా ఏర్పాటు చేయనుంది. ప్రైవేట్‌ అంబులెన్స్‌ యాజమానులు ముందుకు రాని పరిస్థితి నెలకొనడంతో బల్దియానే ప్రత్యేక అంబులెన్స్‌ ఏర్పాటు కోసం ముందుకు వచ్చింది. 12 మంది సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని కరోనా మృతదేహాల అంత్యక్రియల కోసం కమిషనర్‌ ఏర్పాటు చేశారు. ఆర్‌ఎఫ్‌వో జీవీ నారాయణరావు పర్యవేక్షణలో డీఎఫ్‌వో కిశోర్‌ టీమ్‌లీడర్‌గా ఉంటారు. 12 మందితో కూడిన ప్రత్యేక బృందం, ప్రభుత్వ నిబంధనల ప్రకారం కరోనా మృతుల అంత్యక్రియలు జరిగేలా పర్యవేక్షిస్తుంది. మృతదేహాల తరలింపు కోసం అంబులెన్స్‌ సమకూర్చే బాధ్యతలను ఏఈ రంజిత్‌కు అప్పగించారు. మృతదేహాల తరలింపు ముందు, తర్వాత అంబులెన్స్‌కు శానిటైజేషన్‌ చేసే బాధ్యతలను శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ శ్యామ్‌రాజ్‌కు అప్పగించారు. ప్రత్యేక బృందం సభ్యులు అంకితభావంతో విధులు నిర్వర్తించాలని కమిషనర్‌ సూచించారు.

  హోం క్వారంటైన్‌ కోసం గెస్ట్‌హౌస్‌..

  కరోనా పాజిటివ్‌ వచ్చిన బల్దియా కింది స్థాయి సిబ్బందికి హోం క్వారంటైన్‌ బాధ్యతలను సైతం బల్దియా స్వీకరించింది. వారికోసం మున్సిపల్‌ గెస్ట్‌హస్‌, మచిలీబజార్‌ కమ్యూనిటీ హాళ్లను సిద్ధం చేయాలని అధికారులను కమిషనర్‌ ఆదేశించారు. అవసరమైతే హోం క్వారంటైన్‌లో ఉన్న సిబ్బందికి భోజనం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కమిషనర్‌ నాగేశ్వర్‌, డిప్యూటీ కమిషనర్‌ గోధుమల రాజు, ఇన్‌చార్జి ఎంహెచ్‌వో జీవీ నారాయణరావు, టీపీవో విజయలక్ష్మి, డీఎఫ్‌వో కిశోర్‌, సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

  కరోనా బాధితులకు మెరుగైన సేవలందించాలి

  • n చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌
  • n ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో వైద్యాధికారులతో సమీక్ష 
  • n లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు సూచన
  • n పాజిటివ్‌ వ్యక్తులు భయపడద్దని పిలుపు


  నయీంనగర్‌ : కరోనా బాధితులకు మెరుగైన వైద్యసేవలందించాలని ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ ఆదేశించారు. వైరస్‌ విస్తృతి పెరిగిన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై వైద్యాధికారులతో హన్మకొండ బాలసముద్రంలోని పశ్చిమ ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో బుధవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్‌విప్‌ మాట్లాడుతూ ప్రభుత్వం కరోనాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. ప్రజలు ఎవరికైనా కరోనా లక్షణాలు కన్పిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వైరస్‌ సోకిన వారు ఏమాత్రం భయపడకుండా ఉండాలని, పౌష్టికాహారం తీసుకుంటూ, తగిన మందులు వాడితే కరోనాను జయించవచ్చని పేర్కొన్నారు. నగరంలోని 14 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో కరోనా పరీక్షలు చేస్తున్నారని, నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వమే ఉచితంగా మందుల కిట్‌ అందిస్తున్నదని చెప్పారు. కరోనా బాధితులు అధైర్యపడకుండా 17రోజుల పాటు హోంక్వారంటైన్‌లో ఉండి వైద్యులిచ్చిన మందులు వాడితే కరోనా నయమవుతుందని తెలిపారు. అనంతరం నగరంలో కరోనా పరిస్థితులు, వైద్య సదుపాయాలు, వైరస్‌ కట్టడికి వ్యూహాలు, టెస్టులపై అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండి, ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని పేర్కొన్నారు. కంటైన్‌మెంట్‌ జోన్లలో ప్రస్తుత పరిస్థితులు, డాక్టర్ల పనితీరు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లు, ఆహార నాణ్యత వంటి అంశాలను పరిశీలించాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌వో లలితాదేవి, అడిషనల్‌ డీఎంహెచ్‌వో డాక్టర్‌ మదన్‌మోహన్‌ పాల్గొన్నారు.   logo