శనివారం 24 అక్టోబర్ 2020
Warangal-city - Jul 25, 2020 , 04:30:45

పోతన విగ్రహంతో నగరానికి కొత్తశోభ

పోతన విగ్రహంతో నగరానికి కొత్తశోభ

  • తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌

వరంగల్‌, జూలై 24: గ్రేటర్‌ కార్పొరేషన్‌ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన బమ్మెర పోతన విగ్రహంతో నగరానికి కొత్త శోభ వచ్చిందని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ అన్నారు. కుడా ఆధ్వర్యంలో వరంగల్‌లో ఏర్పాటు చేసిన పోతన విగ్రహం, జంక్షన్‌ను శుక్రవారం ఆయన అవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ కుడా ఆధ్వర్యంలో పోతన జంక్షన్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారని అభినందనలు తెలిపారు. లైటింగ్‌, గ్రీనరీలతో పాటు జంక్షన్‌లో చిన్న చిన్న విగ్రహలు ఏర్పాటు చేయడం బాగుందన్నారు. ఆయనవెంట కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, వైస్‌ చైర్‌పర్సన్‌ పమేలా సత్పతి, స్థానిక కార్పొరేటర్‌ రిజ్వానా మసూద్‌, కుడా ప్లానింగ్‌ అధికారి అజిత్‌రెడ్డి, ఈఈ భీంరావు, తదితరులున్నారు. 


logo