గురువారం 29 అక్టోబర్ 2020
Warangal-city - Jul 24, 2020 , 01:30:47

పొదుపు పథకం కింద రూ.1.58 కోట్లు జమ

పొదుపు పథకం కింద రూ.1.58 కోట్లు జమ

శాయంపేట/కలెక్టరేట్‌: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేతన్న కు చేయూత పథకం కింద కార్మికుల ఖాతాల్లో రూ.1.58 కోట్లను జమ చేసినట్లు చేనేత జౌళి శాఖ జిల్లా సహాయ సంచాలకుడు రాఘవరావు గురువారం తెలిపారు. పొదుపు పథకంలోని ఆర్‌డీ1, ఆర్‌డీ 2 బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేసినట్లు పేర్కొన్నారు. రూరల్‌ జి ల్లాలో 404 మంది చేనేత కార్మికుల ఖాతాలో రూ.1.27 కోట్లు, 95 మంది మరమగ్గాల కార్మికుల ఖాతాలో రూ.31.29 లక్షలు జమ య్యాయని తెలిపారు. కొవిడ్‌-19 నేపథ్యంలో ప్రభుత్వం మూడేళ్ల గడువుకు ముందే పొదుపు మొత్తాన్ని తీసుకునే అవకాశం కల్పించ డంతో చేనేత, మరమగ్గాల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.