బుధవారం 21 అక్టోబర్ 2020
Warangal-city - Jul 24, 2020 , 01:20:25

మంత్రి పీఏ, గన్‌మెన్‌కు పాజిటివ్‌

మంత్రి పీఏ, గన్‌మెన్‌కు పాజిటివ్‌

పర్వతగిరి, జూలై 23: రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పీఏతో పాటు ఇద్దరు గన్‌మన్లు, ఒక  కానిస్టేబుల్‌, డ్రైవరు, మరో సహాయకుడికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు సమాచారం. ఈనెల 21న వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని మంత్రి స్వగృహంలో ఆయన వెంట ఉండే పీఏలు, గన్‌మన్లు, సహాయకులు మొత్తం 40 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. ఈ టెస్టుల్లో ఆరుగురికి పాజిటివ్‌ రిపోర్టు వచ్చినట్లు తెలిసింది. వీరంతా హైదరాబాద్‌లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది.

వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌కు...

హన్మకొండ : కలెక్టర్‌ రాజీవ్‌గాంధీహన్మంతుకు కరో నా పాజిటివ్‌ రిపోర్టు వచ్చినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ లలితాదేవి తెలిపారు. హోం ఐసోలేషన్‌లో ఉండా లని సూచించినట్లు ఆమె పేర్కొన్నారు.


logo