గురువారం 22 అక్టోబర్ 2020
Warangal-city - Jul 21, 2020 , 01:37:38

ప్రారంభానికి సిద్ధంగా పబ్లిక్‌ టాయిలెట్లు

ప్రారంభానికి సిద్ధంగా పబ్లిక్‌ టాయిలెట్లు

కాజీపేట, జూలై 20  : కాజీపేటలో అభివృద్ధి పనులు శరవేగంగా దూసుకుపోతున్నాయి. కాజీపేటతోపాటు  వివిధ ప్రాంతా ల్లో గ్రేటర్‌ కార్పొరేషన్‌ అధికారులు యుద్ద ప్రతిపాదిక నిర్మించిన ప్రజా మరుగుదొడ్లు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి.  స్వచ్ఛ భారత్‌లో భాగంగా పట్టణ ప్రజల మౌలిక అవసరాలను తీర్చేందుకు పలు చోట్ల కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో స్త్రీ, పురుషులకు వేర్వేరుగా పబ్లిక్‌ టాయిలెట్లను నిర్మిస్తున్నారు. ఈ మేరకు కాజీపేటలో నాలుగు ప్రధాన ప్రాంతాల్లో నిర్మించిన ప్రజా మరుగుదొడ్లు త్వరలోనే వినియోగంలోని రానున్నాయి.  ప్రతి వెయ్యి మందికి ఒక ప్రజా మరుగుదొడ్డిని నిర్మించాలనే ప్రభుత్వ నిర్ణ యం మేరకు  రద్దీ కలిగిన పలు ప్రాంతాల్లో గ్రేటర్‌ కమిషనర్‌ పమేలా సత్పతి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక్కడ ఆధునిక, మౌలిక సదుపాయాలతో మరుగుదొడ్లను నిర్మించేలా చర్యలు తీసుకున్నారు. కాజీపేట ప్రాం తంలో ఎక్కవగా రద్దీ ఉండే  ఆర్వోబీ, బాపూజీనగర్‌ ప్రధాన రహదారి, జూబ్లీ మార్కెట్‌, పేదలు నివాసముండే ఏఆర్‌ఆర్‌ నగర్‌కాలనీలో అన్ని సదుపాయాలతో  ప్రజా మరుగుదొడ్లను నిర్మించారు. ఇవి త్వరలోనే అందుబాటులోని రానున్నాయి.  నగరానికి ముఖ ద్వారంగా ఉన్న కాజీపేటకు రోజు చుట్టు పక్కల గ్రామాల నుంచి వేలాది మంది వివిధ పనులపై వస్తూ పోతుంటారు.    ప్రజామరుగుదొడ్లు లేకపోవడంతో ఎక్కడపడితే అక్కడ మల,మూత్ర విసర్జన చేసేవారు. దీంతో చౌరస్తా, ఇతర ముఖ్య కూడళ్ల వద్ద తీవ్ర దుర్వాసన వచ్చేది. కాగా, దూరప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పట్టణంలో ప్రజల అవసరాలను గుర్తించి, అవసరం ఉన్న చోట స్త్రీ, పురుషులకు వేర్వేరుగా ప్రజా మరుగుదొడ్లను నిర్మించింది. దీంతో స్థానికులు, ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  logo