గురువారం 29 అక్టోబర్ 2020
Warangal-city - Jul 21, 2020 , 01:03:45

పంటల సాగు నమోదుపై ప్రభుత్వం కీలక నిర్ణయం

పంటల సాగు నమోదుపై ప్రభుత్వం కీలక నిర్ణయం

 పంటల సాగుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఒకే సీజన్‌లో రైతులు సాగు చేసిన రెండు పంటల లెక్క తేల్చనుంది. మిర్చి రైతులు మిరప పంటకు ముందే ఏటా మేలో వేరుశనగ వేస్తుండగా ఆగస్టు మొదటి వారంలో పంట చేతికి వస్తున్నది. అయితే ఇన్నా ళ్లుగా వానకాలం సీజన్‌ కింద ఒక మిరపనే ఆన్‌లైన్‌లో రికార్డు చేస్తున్నది. ఈ క్రమంలో రైతులు రెండు పంటలు సాగు చేస్తే రెండింటినీ ఆన్‌లైన్‌లో రికార్డు చేసే అవకాశాన్ని కల్పించింది. దీంతో వేరుశనగ పంట ఇక నుంచి ఆన్‌లైన్‌లో నమోదు కానుంది. ఇందుకోసం ఫస్ట్‌క్రాప్‌, సెకండ్‌ క్రాప్‌ అనే ఆప్షన్‌ ఇచ్చింది. దీంతో వ్యవసాయ అధికారులు వేరుశనగ పంట వివరా లను రికార్డు చేస్తున్నారు. - వరంగల్‌ రూరల్‌, నమస్తే తెలంగాణ

వరంగల్‌రూరల్‌-నమస్తేతెలంగాణ : రైతులకు ఆదాయం పెంచడమే లక్ష్యంగా ప్రభు త్వం ముందుకు వెళ్తున్నది. ఈ నేపథ్యంలో జిల్లాకో ఫుడ్‌ ఇండస్ట్రీ పార్కుతోపాటు ప్రతి అ సెంబ్లీ నియోజవర్గానికో పరిశ్రమ ఏర్పాటు చే సేందుకు నిర్ణయించింది. వానకాలం సీజన్‌ ఉత్పత్తులు చేతికొచ్చేలోగా వీటిని స్థాపించి రై తులకు ప్రత్యక్షంగా లాభాలు చూపాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో రైతులు సాగు చేసే ప్రతి పంటనూ వ్యవసాయశాఖ పక్కాగా ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా సాఫ్ట్‌వేర్‌ తయా రు చేసింది. ఈక్రమంలో ఒకే సీజన్‌లో రైతులు రెండు పంటలు సాగు చేస్తే రెండింటినీ అధికారులు ఆన్‌లైన్‌లో రికార్డు చేసే అవకాశాన్ని క ల్పించడం విశేషం. దీంతో ముఖ్యంగా మిర్చి రైతులు వానకాలం సీజన్‌లో సాగు చేసే వేరుశనగ పంట ఇకనుంచి ఆన్‌లైన్‌లో నమోదు కా నుంది. ఎంత విస్తీర్ణంలో రైతులు వేరుశనగ పంట సాగు చేశారనే లెక్క తేలనుంది. పంట నష్టం వాటిల్లిన సమయంలో రైతులకూ ప్ర యోజనం కలగనుంది. ఇన్నాళ్లు ప్రతి సంవత్స రం వానకాలం, యాసంగి సీజన్‌లో రైతులు సాగు చేసిన పంటల వివరాలను వ్యవసాయశాఖ అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఒక సీజన్‌లో రైతులు రెండు పంటలు సాగు చేసినా ఒక పంట వివరాలను మాత్రమే రికార్డు చేశారు. ఎందుకంటే ఒక సీజన్‌లో ఒక పంట వివరాలను మాత్రమే ఆన్‌లైన్‌లో నమో దు చేసే ఆప్షన్‌ ఉండేది. ఫలితంగా మరో పంట సాగు జరిగినట్లు లెక్కల్లో ఉండేది కాదు.

ఉదాహరణకు..

వరంగల్‌ రూరల్‌ జిల్లాలో రైతులు ప్రతి సం వత్సరం మిర్చి పంట సాగు చేస్తారు. నల్లబెల్లి, నర్సంపేట, చెన్నారావుపేట, దుగ్గొండి, నెక్కొం డ, ఖానాపురం, పరకాల, నడికూడ మండలా ల్లో సుమారు 14 వేల ఎకరాల విస్తీర్ణంలో పం డిస్తున్నారు. యేటా ఆగస్టు రెండో వారం నుం చి సెప్టెంబరు రెండో వారంలోగా మిర్చి మొక్క లు నాటుతున్నారు. ఇన్నాళ్లు వ్యవసాయ శాఖ అధికారులు మిర్చి పంట సాగు వివరాలను వానకాలం సీజన్‌ కిందే ఆన్‌లైన్‌లో రికార్డు చే స్తున్నారు. ఇదే మిర్చి రైతులు మిరప పంట సా గు చేయడానికి ముందు ప్రతి సంవత్సరం వా నకాలం సీజన్‌లో వేరుశనగ పంట పండిస్తున్నారు. ఇరిగేషన్‌, డ్రిప్‌ వసతి ఉన్న భూముల్లో మే నెలలో వేరుశనగ విత్తనాలు నాటుతున్నా రు. ఆగస్టు మొదటి వారంలోగా ఈ పంట రై తుల చేతికి వస్తుంది. ఒక్కో ఎకరంలో ఐదు నుంచి ఎనిమిది క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నా రు. మార్కెట్‌లో పచ్చి వేరుశనగకాయకు క్విం టాల్‌ ధర రూ.3,500 నుంచి రూ.3,800 వర కు పలుకుతుంది. ఒక్కో ఎకరంలో వస్తున్న సు మారు రూ.20 వేల ఆదాయాన్ని రైతులు మి ర్చి పంట సాగుకు అవసరమైన పెట్టుబడిలో స గం వరకు వేరుశనగతోనే సమకూర్చుకుంటున్నారు. ఒక నర్సంపేట డివిజన్‌లోనే దాదాపు ఎనిమిది వేల ఎకరాల విస్తీర్ణంలో వేరుశనగ పంట సాగు అవుతున్నట్లు అధికారుల అంచ నా. ప్రతి సంవత్సరం వానకాలం సీజన్‌లో వ్యవసాయశాఖ అధికారులు మిర్చి పంట సా గు విస్తీర్ణాన్ని మాత్రమే ఆన్‌లైన్‌లో రికార్డు చే స్తున్నారు. ఆప్షన్‌ లేకపోవడం వల్ల వేరుశనగ పంట సాగు వివరాలను నమోదు చేయలేకపోయారు. దీంతో వేరుశనగ పంట సాగు జరిగిన ట్లు రికార్డుల్లో ఉండేది కాదు. మిర్చికంటే ముం దు సాగైన మొక్కజొన్న, పెసర పంటలదీ ఇదే పరిస్థితి.

తాజాగా నమోదుకు అవకాశం..

వానకాలం సీజన్‌లో వేరుశనగ పంట వివరాలను కూడా ఆన్‌లైన్‌లో నమోదు చేసే అవకాశం లేకపోవడాన్ని జిల్లా వ్యవసాయశాఖ అ ధికారులు పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. చివరకు సర్కారు కొద్ది రోజుల క్రితం కీలక నిర్ణయం తీసుకుంది. వానకాలం సీజన్‌ లో రైతులు రెండు పంటలు సాగు చేస్తే రెండింటినీ వ్యవసాయశాఖ అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు ఫస్ట్‌క్రాప్‌, సెకండ్‌ క్రాప్‌ అనే ఆప్షన్‌ ఇచ్చింది. ఈ మేరకు రికార్డు చేయాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశిస్తూ కొద్ది రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారు(ఏఈవో)లు మిర్చి సాగు చేయనున్న రైతులు ఇప్పటికే సాగు చేసిన వేరుశనగ పంట వివరాలను ఫస్ట్‌క్రాప్‌ ఆప్షన్‌ కింద ఆన్‌లైన్‌లో రికార్డు చేస్తున్నారు. రైతుబంధు పథకం నుంచి ఆర్థికసాయం అందుకున్న రైతుల జాబితా ప్ర కారం వేరుశనగ పంట సాగైన భూముల సర్వే నంబరు, విస్తీర్ణం, సాగు చేసిన రైతు పేరు, మొబైల్‌ నంబరు, ఇతర వివరాలనూ నమోదు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫారంపై వేరుశనగ పంట సాగు చేసిన రైతుల సంతకాలను కూడా తీసుకుంటున్నా రు. దీంతో మరో కొద్ది రోజుల్లో జిల్లాలో ఈ వానకాలం సీజన్‌లో సాగైన వేరుశనగ పంట విస్తీర్ణం లెక్క తొలిసారి తేలనుంది. వేరుశనగతోపాటు రైతులు ఇప్పుడు సాగు చేసిన మొక్కజొన్న, పెసర తదితర పంటల లెక్క కూడా తేలనుంది. ఆగస్టులో రైతులు సాగు చేసే మిర్చి పంట వివరాలను వ్యవసాయశాఖ అధికారులు ఆన్‌లైన్‌లో రెండోక్రాప్‌ ఆప్షన్‌లో నమోదు చేస్తారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం ఈ విధానం అమలు కానుంది.


logo