మంగళవారం 27 అక్టోబర్ 2020
Warangal-city - Jul 20, 2020 , 04:09:54

సిద్ధేశ్వరుడికి రుద్రాక్షలతో అభిషేకం

సిద్ధేశ్వరుడికి రుద్రాక్షలతో అభిషేకం

వరంగల్‌ కల్చరల్‌/హన్మకొండ : ఆషాఢమాసం, చతుర్దశి తిథి ఆదివారం మాసశివరాత్రి సందర్భంగా హన్మకొండ పద్మాక్షి రోడ్డులోని సిద్ధేశ్వర ఆలయంలో స్వామివారికి లక్ష రుద్రాక్షలతో అభిషేకం నిర్వహించారు. అక్షర గ్రూప్‌ చైర్మన్‌ దంపతులు పేరాల శ్రీవిద్య-శ్రీ నివాసరావు కాశీ తదితర ప్రాంతాల నుంచి ఈ రుద్రాక్షలను ప్రత్యేకంగా తెప్పించినట్లు  ప్రధాన అర్చకుడు సిద్ధేశుని సురేశ్‌ తెలిపారు. అనంతరం సిద్ధేశ్వరుడిని రుద్రాక్ష మాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. కార్యక్రమంలో సిద్ధేశుని రవికుమార్‌ పాల్గొన్నారు.


logo