మంగళవారం 20 అక్టోబర్ 2020
Warangal-city - Jul 19, 2020 , 01:48:49

పీజీ వైద్య కళాశాలలో కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీ

పీజీ వైద్య కళాశాలలో కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీ

  • నేడు, రేపు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ఆహ్వానం

పోచమ్మమైదాన్‌ (వరంగల్‌), జూలై 18 : పీజీ నీట్‌ కటాఫ్‌ స్కోర్‌ తగ్గడంతో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి వరంగల్‌ కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ అధికారులు శనివారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలతోపాటు హైదరాబాద్‌ నిమ్స్‌ కళాశాలలో కన్వీనర్‌ కోటా కింద ఉన్న పీజీ వైద్య సీట్లను భర్తీ చేయనున్నట్లు కాళోజీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

తగ్గిన కటాఫ్‌ స్కోర్‌ ఆధారంగా ఆర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 19న ఉదయం 8 గంటల నుంచి 20వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుతోపాటు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం తుది మెరిట్‌ జాబితాను విడుదల చేస్తామని తెలిపారు. పీజీ వైద్య ప్రవేశాలకు జనరల్‌ కేటగిరిలో 275 (30 శాతం) కటాఫ్‌ మార్కులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 230 (20 శాతం) కటాఫ్‌ మార్కులు, అలాగే దివ్యాంగులకు (ఓసీ) 252 (25 శాతం) కటాఫ్‌ మార్కులను తగ్గించారని వివరించారు. ఇతర సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ చూడాలని సూచించారు.logo