ఆదివారం 25 అక్టోబర్ 2020
Warangal-city - Jul 18, 2020 , 02:19:38

వందేళ్ల నిషాన్‌

వందేళ్ల నిషాన్‌

  • ఈ టేకు దుంగకు హండ్రెడ్‌ ఇయర్స్‌

ఇదిగో.. ఈ ఫొటోలో కనిపిస్తున్న టేకు దుంగకు వందేళ్ల చరిత్ర ఉన్నది.  కొన్నేళ్ల క్రితం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో దట్టమైన అడవి ఉండేది. వరంగల్‌ నగరానికి 20 కిలో మీటర్ల దూరంలోనే కీకారణ్యంలో  ఏపుగా, బలిష్టంగా పెరిగిన టేకు వనాలు ఉండేవి. అప్పుడు ఈ చెట్లను స్మగ్లర్లు నరికి, దుంగలుగా చేసి ఎడ్లబండ్లపై రవాణా చేసేవారు. ఈ వ్యవహారంలో 40 ఏళ్ల క్రితం వరంగల్‌ నగరానికి ఎండ్లబండిలో తరలిస్తున్న టేకు దుంగలను ఫారెస్ట్‌ అధికారులు పట్టుకొని, డిపోకు తరలించారు. అందులో ఒక దుంగను సుబేదారి ఫారెస్ట్‌ (ఉమ్మడి వరంగల్‌ ) వరంగల్‌ సర్కిల్‌ ఆఫీస్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ చాంబర్‌ ముందు ఇలా నిషాన్‌గా పెట్టారు. ఒకప్పుడు ఉమ్మడి వరంగల్‌లో టేకు చెట్లు ఇలా ఉండేవని ఈ తరానికి చూపించేందుకే ఈ టేకు దుంగను తమ ఆఫీస్‌ వద్ద గుర్తుగా పెట్టామని వరంగల్‌ సర్కిల్‌ సీఎఫ్‌వో అక్బర్‌ ‘నమస్తే’కు వివరించారు.  

- సుబేదారి 


logo