గురువారం 29 అక్టోబర్ 2020
Warangal-city - Jul 17, 2020 , 02:48:46

బాధితులకు ‘డబుల్‌' ఇండ్లు కట్టిస్తాం

బాధితులకు ‘డబుల్‌' ఇండ్లు కట్టిస్తాం

ఆత్మకూరు: రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయే బాధితులకు ప్రభుత్వం నుంచి వచ్చే డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హామీ ఇచ్చారు. గురువారం ఆయన ఆత్మకూరు మండలం అక్కంపేటలో రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. రోడ్లు విస్తరిస్తే రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని సూచించారు. ఇండ్లు కోల్పోతున్న వారి జాబితాను తయారు చేసి ఇవ్వాలని ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే నియోజకవర్గంలో 182 మందికి ఇళ్లు మంజూరు చేశామన్నారు. ఎమ్మెల్యే వెంట రెడ్‌క్రాస్‌ రూరల్‌ జిల్లా చైర్మన్‌ నిమ్మగడ్డ వెంకన్న, కుడా డైరెక్టర్‌ ఏ రవీందర్‌, సర్పంచ్‌ ఏ విజయహంసాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ కే కుమారస్వామి, టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి రవియాదవ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు.


logo