బుధవారం 21 అక్టోబర్ 2020
Warangal-city - Jul 14, 2020 , 05:48:14

‘ధర్మపురి’పై టీఆర్‌ఎస్‌ ఫైర్‌

‘ధర్మపురి’పై టీఆర్‌ఎస్‌ ఫైర్‌

  • అర్వింద్‌ను పిచ్చాస్పత్రిలో చేర్చాలి
  • దమ్ముంటే పసుపు బోర్డు తీసుకురా
  • బిల్లా-రంగా అంటే దాడులు చేయరా?
  • బీజేపీవి అసత్య ప్రచారాలు 
  • నిజామాబాద్‌ ఎంపీ వ్యాఖ్యలపై గులాబీ నేతల మండిపాటు

నయీంనగర్‌, జూలై13: బీజేపీ నేతలు బట్టకాల్చి మీదేస్తే ఊరుకునేది లేదని టీఆర్‌ఎస్‌  ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు, బీజేపీ నేతల వ్యవహార సరళిపై సోమవారం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో గులాబీ పార్టీ నేతలు విలేకరుల సమావేశంలో మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్వింద్‌ పిచ్చి పట్టినట్టు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాడని, మెంటల్‌ ఆస్పత్రిలో చేర్చాలని అన్నారు. దమ్ముంటే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిజామాబాద్‌లో పసుపుబోర్డుతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తేవాలని డిమాండ్‌ చేశారు.

దేశంలోనే ఆదర్శ పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేయడం తగదన్నారు.  ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌పై విమర్శలు చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని  హెచ్చరించారు.  కాంగ్రెస్‌ హయాంలో బీఫాంలు అమ్ముకుని కోట్లు దండుకున్న అర్విందా.. ఇప్పుడు మాట్లాడేదని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ నేతలపై అసత్య ఆరోపణలు చేస్తే  సూర్యుడిపై ఉమ్మేసినట్టే అవుతుందని దుయ్యబట్టారు. ఇకనైనా బీజేపీ నేతలు తమ పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. కొత్త సెక్రటేరియ ట్‌ భవనాన్ని అన్ని హంగులతో నిర్మించాలనుకుంటే దానిపై బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు అర్థంపర్థంలేని విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు.

దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథ కాలు అమలవుతున్నాయని, మరెక్కడైనా ఇలా జరుగుతున్నాయా.. ప్రతిపక్షాలు చెప్పాలని అన్నారు. వాస్తవాలు మాట్లాడాలి.. కానీ విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే పార్టీ నాయకులు, అభిమానులను కంట్రోల్‌ చేయడం కష్టతరమవుతుందని అన్నారు.  నాలుగు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన వినయ్‌భాస్కర్‌, ఉద్యమ కాలం నుంచి సేవలందిస్తున్న నన్నపునేని నరేందర్‌పై విమర్శలు చేసి అవమానించడం బీజేపీ నాయకులకు సిగ్గుచేటన్నారు. ఆ పార్టీ కార్పొరేటర్‌గా గెలువని నాయకులు వ్యక్తిగత విమర్శలు చేస్తే దాడులు తప్పవని హెచ్చరించారు.

ప్రజా నాయకులను బిల్లారంగా అంటే కార్య కర్తలు, అభిమానులు  చేతులు కట్టుకుని కూచోరని అన్నారు. ఉద్యమాల గడ్డ వరంగల్‌లో అర్వింద్‌ వేషాలు సాగవని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ స్థలం కోసం డబ్బులు ఇస్తే బీజేపీ అర్బన్‌ జిల్లా అధ్య క్షురాలు రావు పద్మ తన సొంత ప్రయోజనం కోసం వాడుకున్న సంగతి ప్రజలకు, కార్యకర్తలు అప్పుడే మర్చిపోయారా.. అని గుర్తు చేశారు. అర్వింద్‌ దొంగ సర్టిఫికెట్‌ పెట్టి నిజామాబాద్‌ ప్రజలను నిండా ముంచాడని, దాస్యం, నన్నపునేనిపై విమర్శలు చేస్తే నాలుక  చీరేస్తామని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర రైతు విమోచన కమిషన్‌ చైర్మన్‌ నాగుర్ల వెంకటేశ్వర్లు, నగర మేయర్‌ గుండా ప్రకా శ్‌రావు, కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, రాష్ట్ర వికలాంగుల సంస్థ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ కే వాసు దేవరెడ్డి, కార్పొరేటర్లు బోయినపల్లి రంజిత్‌రావు, తాడిశెట్టి విద్యాసాగర్‌, వీరగంటి రవీందర్‌ పాల్గొన్నారు. logo