మంగళవారం 04 ఆగస్టు 2020
Warangal-city - Jul 13, 2020 , 01:37:22

వరంగల్‌లో కంటైన్మెంట్‌ జోన్లు

వరంగల్‌లో కంటైన్మెంట్‌ జోన్లు

వరంగల్‌ చౌరస్తా, జూలై 12 : వరంగల్‌ నగరంలోని పలు ప్రాంతాలను పోలీసులు, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఆదివారం కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించారు. ఇంతేజార్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గిర్మాజీపేట, మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బందెల్లిశెట్టి వీధి, విశ్వకర్మ వీధి, దుర్గేశ్వరాలయవీధితో పాటు పలు కాలనీలు, ప్రధాన వ్యాపార కేంద్రాలను కంటైన్మెంట్‌ జోన్లుగా గుర్తించి బారికేడ్లను ఏర్పాటు చేశారు. కొంతకాలంగా నగరంలో పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని పలువురు వ్యాపారులు దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేస్తున్నారు. కరోనా వైరస్‌ నియంత్రణ కోసం కంటైన్మెంట్‌ జోన్లను ప్రకటించి, జనసంచారాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.


logo