శుక్రవారం 07 ఆగస్టు 2020
Warangal-city - Jul 13, 2020 , 01:11:03

‘రిజిస్ట్రేషన్‌ శాఖలో నియామకాలు లేవు’

‘రిజిస్ట్రేషన్‌ శాఖలో నియామకాలు లేవు’

హన్మకొండ, జూలై 12: వరంగల్‌ ఉమ్మడి జిల్లా పరిధిలో రిజిస్ట్రార్‌, సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో ఎలాంటి ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదని జిల్లా రిజిస్ట్రార్‌ తులసి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొన్ని రోజులుగా రిజిస్ట్రేషన్‌ శాఖలో ఔట్‌సోర్సింగ్‌ నియామకం పేరుతో కొందరు వ్యక్తులు నిరుద్యోగులను తప్పుదారి పట్టిస్తున్నారని, ఈ విషయంలో నిరుద్యోగ యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దళారులను గుర్తిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.


logo