శనివారం 24 అక్టోబర్ 2020
Warangal-city - Jul 12, 2020 , 03:37:32

ఎస్సారెస్పీ కెనాల్‌ చుట్టూ గ్రీనరీ ఏర్పాటు

ఎస్సారెస్పీ కెనాల్‌ చుట్టూ గ్రీనరీ ఏర్పాటు

పోచమ్మమైదాన్‌: వరంగల్‌ తూర్పు నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎస్సారెస్పీ కెనాల్‌ చుట్టూ గ్రీనరీ ఏర్పాటుతోపాటు వాకింగ్‌కు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ ఆదేశించారు. ములుగురోడ్డు బ్రిడ్జి నుంచి డాక్టర్స్‌కాలనీ, దేశాయిపేట వరకు ఉన్న కెనాల్‌ను శనివారం ఆయన పరిశీలించారు. నగరానికి మధ్యలో, జనావాసాల మధ్య ఉన్న కెనాల్‌ను ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా చేయాలన్నారు. కెనాల్‌కు ఇరువైపులా హద్దులు సరిచేసి, రోడ్డు మరమ్మతులు, నాలాలను అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. అలాగే, కెనాల్‌ చుట్టూ అందంగా, పచ్చదనం వెల్లివిరిసేలా గ్రీనరీ, పాదచారుల వాకింగ్‌ కోసం తగిన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ముఖ్యంగా మున్సిపాలిటీ, రెవెన్యూ, ఎస్సారెస్పీ అధికారులు సమన్వయంతో పని చేసి, అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యే అన్నారు. ఆయన వెంట స్థానిక కార్పొరేటర్‌ కావటి కవిత రాజుయాదవ్‌, ఎస్సారెస్పీ ఎస్‌ఈ బాలకృష్ణ, ఏఈ మాధవరావు ఉన్నారు.


logo