శనివారం 24 అక్టోబర్ 2020
Warangal-city - Jul 12, 2020 , 03:33:11

సంబురంలా.. సాగుబాట‌

సంబురంలా..  సాగుబాట‌

కాలం కరుణించి సీజన్‌ ప్రారంభం నుంచే వానలు మంచిగపడుతున్నయ్‌.. ఇప్పటికే కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టు కాలువల ద్వారా చెరువులు, బావులు నిండి ఉన్నయ్‌.. భూ గర్భ జలాలు సైతం ఉబికుబికి వస్తున్నయ్‌.. ‘రైతుబంధు’తో పెట్టుబడి తిప్పలు తప్పినయ్‌.. కరెంటు కష్టాలు ఎన్నడో గట్టెక్కినయ్‌.. ఇగ అదునుకు అన్నీ అందడంతో అన్నదాతల్లో ఉత్సాహం రెట్టించింది.. జోరుగా.. హుషారుగా సాగుబాట పట్టేలా చేసింది.. ఇదిగో ఇలా ఏ ఊరిన చూసినా పచ్చని పొలం మడులు, అప్పుడే పుట్టిన బిడ్డలసొంటి మొలకలతో చేను చెలకలు కనువిందు చేస్తున్నయ్‌.. ఆటపాటలతో పొలం పనులల్ల వడ్డ ఆడబిడ్డలు, చేనుచెలకలల్ల అరకలు పట్టి ఎవుసం చేస్తుంటే చూడముచ్చటగున్నది. దున్నుడు.. నారు మడులుగట్టుడు, గొర్రు గొట్టుడు.. మందుజల్లుడు.. నాట్లేసుడు.. కలుపుదీసుడు.. గిట్ల ఎక్కడ చూసినా కర్షకలోకం బిజీబిజీగా కనిపిస్తున్నది. ఈ సంబురమసొంటి సాగు చిత్రాలను బంధించిన ‘నమస్తే’.. మీ ముందుకు తెచ్చింది..        

    - స్టాఫ్‌ ఫొటో గ్రాఫర్లు, వరంగల్‌/ భూపాలపల్లి 


logo