శనివారం 24 అక్టోబర్ 2020
Warangal-city - Jul 11, 2020 , 01:35:19

మరో ఆరు పాజిటివ్‌

మరో ఆరు పాజిటివ్‌

వరంగల్‌ చౌరస్తా: ఎంజీఎం కొవిడ్‌-19 విభాగంలో మరో ఆరు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం 40 మంది అనుమానితులను అడ్మిట్‌ చేసుకొని వారి నుంచి నమూనాలు సేకరించి ల్యాబ్‌కు అందజేసినట్లు  చెప్పారు. వ్యాధి లక్షణాలు కనిపించని 14 మందికి కౌన్సెలింగ్‌ ఇచ్చి స్వీయ, గృహ నిర్బంధంలోనే ఉండాలని సూచించి డిశ్చార్జి చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఎంజీఎంలో 77 మంది వైద్యసేవలు పొందుతున్నట్లు తెలిపారు.

పార్ధివదేహాల అప్పగింతకు అడ్డంకి

పోచమ్మమైదాన్‌: వరంగల్‌ కాకతీయ వైద్య కళాశాలలో పార్ధివదేహాల అప్పగింతకు కరోనా వైరస్‌ అడ్డంకిగా మారింది. వైద్య విద్యార్థుల పరిశోధనకు ఉపయోగించే పార్ధివదేహాలను కొవిడ్‌-19 నేపథ్యంలో అధికారులు తిరస్కరిస్తున్నారు. తాజాగా శుక్రవారం హన్మకొండ పరిమళకాలనీలో మృతి చెందిన వృద్ధురాలు పులవేణి గౌరమ్మ, ప్రశాంత్‌నగర్‌లోని సహృదయ వృద్ధాశ్రమంలో మృతి చెందిన వృద్ధుడు అబ్బులు పార్థీవదేహాలను తెలంగాణ నేత్ర, అవయదాన అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కేఎంసీకి తీసుకురాగా అధికారులు తిరస్కరించారు. వైద్య విద్యకు ఉపయోగపడాల్సిన పార్ధివదేహాలను కాల్చాల్సి రావడం బాధాకరమని అసోసియేషన్‌ అధ్యక్షుడు కొన్‌రెడ్డి మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.


logo