గురువారం 22 అక్టోబర్ 2020
Warangal-city - Jul 10, 2020 , 02:25:28

కేయూను సందర్శించిన ఐఎస్‌వో ప్రతినిధులు

కేయూను సందర్శించిన ఐఎస్‌వో ప్రతినిధులు

వరంగల్‌ కల్చరల్‌: కేయూను నాణ్యతా ప్రమాణాల నిర్వహణ సంస్థ(ఐఎస్‌వో) బృందం గురువారం సందర్శించింది. వర్సిటీలోని అన్ని విభాగాలు, రికార్డులు,  ప్రయోగశాలలు, విభాగ గ్రంథాలయాల నిర్వహణను పరిశీలించారు. అనంతరం విభాగాధిపతులకు విభాగాల విజన్‌, మిషన్‌, ఆబ్జెక్టివ్‌లకు సంబంధించి పలు సూచనలు చేశారు. గురువారం తయారు చేసిన నివేదికను ఐఎస్‌వో హెడ్‌ ఆఫీస్‌ లండన్‌కు పంపించి ఉత్తర్వులను అనుసరించి సర్టిఫికేషన్‌ను ప్రకటిస్తామని బృందం తెలిపింది. ఐఎస్‌వో బృందానికి సమన్వయకులుగా ప్రొఫెసర్‌ బీ వెంకట్‌రాంరెడ్డి, ప్రొఫెసర్‌ కే డేవిడ్‌ వ్యవహరించారు. అనంతరం కేయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కే పురుషోత్తం ఐఎస్‌వో బృందాన్ని శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. కార్యక్రమంలో ఐఎస్‌వో ప్రతినిధులు ఆలపాటి శివయ్య, ప్రొఫెసర్‌ బీ కృష్ణారెడ్డి, ప్రొఫెసర్‌ ఏ సూర్యనారాయణ, టీ సుమాదేవి పాల్గొన్నారు.


logo