ఆదివారం 25 అక్టోబర్ 2020
Warangal-city - Jul 07, 2020 , 05:35:15

భావితరాల ఉజ్వల భవిష్యత్తే లక్ష్యం : రెడ్యా

భావితరాల ఉజ్వల భవిష్యత్తే లక్ష్యం : రెడ్యా

మరిపెడ, జూలై 06: భావితరాల ఉజ్వల భవిష్యత్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధాన లక్ష్యమని డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌ అన్నారు. ఆరో విడత హరితహారంలో భాగంగా మరిపెడ మున్సిపల్‌ కేంద్రం 12వ వార్డు ఎర్రగడ్డ స్ట్రీట్‌లోని ఇంటర్నల్‌ రోడ్డుకిరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. మానుకోట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నవీన్‌, జిల్లా రైస్‌ మిల్లర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ బాధ్యుడు డీఎస్‌ రవిచంద్ర, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సింధూరకుమారి, మరిపెడ ఎంపీపీ గుగులోత్‌ అరుణరాంబాబు, మున్సిపల్‌ కమిషనర్‌ సత్యనారాయణరెడ్డి, వైస్‌ చైర్మన్‌ బుచ్చిరెడ్డి, టీఆర్‌ఎస్‌ నేతలు పాల్గొన్నారు.


logo