మంగళవారం 20 అక్టోబర్ 2020
Warangal-city - Jul 06, 2020 , 07:14:01

నేటి నుంచి కోటలోకి అనుమతి

నేటి నుంచి కోటలోకి అనుమతి

  • అన్‌లాక్‌ 2.0 నిబంధనలు అమలు
  • నగదు రహిత లావాదేవీలతో టికెట్‌

   ఖిలావరంగల్‌: కొవిడ్‌-19 వల్ల మూతపడిన పర్యాటక కేంద్రాలను సందర్శించడానికి అన్‌లాక్‌ 2.0లో వీలు కల్పించారు. సుదీర్ఘ విరామం తర్వాత కోటలోకి పర్యాటకులకు అనుమతిస్తూ కేంద్ర పురావస్తు శాఖ నూతన నిబంధనలను విడుదల చేసింది. తాజా నియమాల ప్రకారం కోటకు వచ్చే పర్యాటకులు నగదు రహిత లావాదేవీలతో మాత్రమే  టికెట్‌ పొందాలని పేర్కొన్నారు. ఇందుకోసం కోటలోని టికెట్‌ కేంద్రం వద్ద క్యూఆర్‌ కోడ్‌ను అందబాటులో ఉంచారు. రోజుకు రెండు వేల మంది పర్యాటకులను మాత్రమే కోటలోకి అనుమతిస్తారు. రెండు స్లాట్‌లుగా విభజించి ఒక్కో స్లాట్‌ టైంలో వేయి మందికి మాత్రమే కోటను సందర్శించే అవకాశం కల్పించారు. అదేవిధంగా కోటలోకి వెళ్లే పర్యాటకులు ఆరోగ్యంగా ఉండి మాస్కు ధరించి ఉండాలి. భౌతికదూరం పాటిస్తూ 45 నిమిషాలపాటు కోటలో పర్యటించవచ్చు. సౌండ్‌ అండ్‌ లైట్‌ షోకు ఇంకా అనుమతి రాలేదని కేంద్ర పురావస్తు శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.


logo