సోమవారం 19 అక్టోబర్ 2020
Warangal-city - Jul 06, 2020 , 07:09:35

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

హన్మకొండ/స్టేషన్‌ఘన్‌ఫూర్‌, జూలై 05: ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన రూ. 4,63,500 విలువైన చెక్కులను లబ్ధిదారులకు మాజీ ఉప ముఖ్య మంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆదివారం పంపిణీ చేశారు. హన్మకొండ, స్టేషన్‌ఘన్‌పుర్‌, చిలుపూరు, ధర్మసాగర్‌ మండలాలకు చెందిన లబ్ధిదారులకు కడియం  హన్మకొండ ఎక్సైజ్‌కాలనీలోని తన నివాసంలో అందించారు. లబ్ధిపొందిన వారిలో 14 మంది ఉన్నారు. అనంతరం శ్రీహరి మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో  లేనివిధంగా తెలంగాణ సర్కారు స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎంతో మందికి సీఎంఆర్‌ఎఫ్‌ సాయం అందించిందన్నారు. ప్రభుత్వ వైద్యశాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. అర్హులు ముఖ్యమంత్రి సహాయ నిధిని వినియోగించుకోవాలని సూచించారు.


logo