శనివారం 24 అక్టోబర్ 2020
Warangal-city - Jul 04, 2020 , 02:46:54

రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు చొరవ చూపాలి

రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు చొరవ చూపాలి

మంత్రి కేటీఆర్‌కు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధుల వినతి

నయీంనగర్/హన్మకొండ: కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ త్వరగా ఏర్పాటు చేసేందుకు చొరవ తీసుకోవాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ను చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ కోరారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ ప్రగతిభవన్‌లో మంత్రిని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధులు కలిసి వినతిపత్రం అందజేశారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వరంగల్ ప్రజల చిరకాల వాంఛ అన్నారు. అందుకు అవసరమైన భూమిని సిద్ధం చేసామని, ఫ్యాక్టరీ మంజూరు, భూముల వివరాలను వారు మంత్రికి తెలియజేశారు. మంత్రిని కలిసిన వారిలో సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, వర్ధన్నపేట నియోజక వర్గం ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఉన్నారు.


logo