మంగళవారం 20 అక్టోబర్ 2020
Warangal-city - Jul 04, 2020 , 02:46:55

ఎదిగిన గిరక మొక్కలు

ఎదిగిన గిరక మొక్కలు

  • 2017లో సొంత డబ్బులతో ప్లాంట్లను తెప్పించిన మంత్రి ఎర్రబెల్లి
  • రూ. పది లక్షలతో రాజమండ్రి నుంచి దిగుమతి
  • గిరక చెట్లతో గీత కార్మికుల సంబురం
  • మరో మూడేళ్లలో కల్లు గీయవచ్చని సంతోషం

పాలకుర్తి, జూలై03: కులవృత్తులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. దీనికి చేదోడువాదోడుగా పాలకుర్తి ఎమ్మెల్యే, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నిలుస్తున్నారు. గీత కార్మికు లకు సొంత ఖర్చులతో 2017లో రూ.10లక్షలతో రాజమండ్రి నుంచి గిరక తాటి మొక్కలను తెప్పించారు. ఆ మొక్కలను పాలకుర్తి నియోజకవర్గంలో ఆయన ఉచితంగా పంపిణీ చేశారు. వీటిని కంఠమ హేశ్వరస్వామి ఆలయం ఎదుట సొసైటీ భూముల్లో  గీత కార్మికులు నాటారు. వీటి సంరక్షణ కోసం ప్ర త్యేకంగా బోరు, మోటర్‌ను ఏర్పాటు చేసి నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో ఆనాడు నాటిన మొ క్కలు ప్రస్తుతం ఎదిగి వస్తున్నాయి. ఈ మొక్కలు ఎనిమిది నుంచి పది అడుగులకు పైగా ఎత్తు పెరిగాయి. మరో మూడేళ్లలో గీత కార్మికులు ఆర్థికంగా రాణించడం కోసం ఎంతో దోహద పడనుంది.

గీతన్నల్లో  మరింత ఉత్సాహం..

గిరకతాటి మొక్కలు ఎదగడంతో గీత కార్మికుల్లో ఉత్సాహం నెలకొంది. తెలంగాణ ప్రాంతంలో తొలి సారిగా మంత్రి  ఎర్రబెల్లి దయాకర్‌రావు సొంత ఖర్చుతో మొక్కలు తెప్పించడంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరో మూడేళ్లలో కల్లు గీయవచ్చని సంతోష పడుతున్నారు.

గిరక తాటి చెట్లతో ఆదాయం..

పాలకుర్తిలో నాటిన గిరక తాటి మొక్కలు మరికొ ద్ది రోజులకు కల్లు గీసేందుకు అందుబాటులోకి వస్తా యి. వీటితో గీత కార్మికులకు ఆదాయం లభిస్తుంది. మంత్రి ఎర్రబెల్లి గిరక తాటి మొక్కల ను పంపిణీ చేయడం సంతోషం. నాడు నాటిన మొక్కలు ఏపుగా పెరిగాయి.

-కమ్మగాని పరమేశ్వర్‌గౌడ్,  గీత కార్మికుడు పాలకుర్తి 


దయన్నకు రుణపడి ఉంటాం..

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గౌడ కులస్తులకు ప్రత్యేకంగా మూడేళ్ల క్రితం గిరక తాటి మొక్కలను తెప్పించి పంపిణీ చేశారు. ఆర్థికంగా రాణించడం కోసం ఇవి ఎంతో ఉపయోగపడుతాయి. మంత్రికి ఎల్లకాలం రుణపడి ఉంటాం. పాలకుర్తి, దర్దేపల్లి తదితర గ్రామాల్లో నాటిన మొక్కలు ఎదుగుతున్నాయి.

- బండి కిరణ్‌కుమార్ గౌడ్, అధ్యక్షుడు, పాలకుర్తి కల్లుగీత కార్మిక సంఘంlogo