గురువారం 29 అక్టోబర్ 2020
Warangal-city - Jul 04, 2020 , 02:46:56

తమిళనాడుకు మన రైస్..

తమిళనాడుకు మన రైస్..

  • n జనగామ నుంచి  బాయిల్డ్ రైస్ ఎగుమతి
  • n 52 వేల క్వింటాళ్లు చేరవేత
  • n హమాలీలకు చేతినిండా పని

జనగామ క్రైం, జూలై 03: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో సాగునీటి వనరులు పెరిగి గత సీజన్‌లో వరి పంట అంచనాలకు మించి చేతికొచ్చింది. దీంతో తెలంగాణ అవసరాలు పోను పక్క రాష్ర్టాలకు సైతం బియ్యం రూపంలో ఎగుమతి చేస్తున్నారు. ఇందులో  జనగామ జిల్లాకేంద్రం నుంచి తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణమలైకి తెలంగాణ పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం వ్యాగన్ లోడ్ బాయిల్డ్ రైస్‌ను ఎగుమతి చేసినట్లు అధికారులు తెలిపారు. జనగామ మండలం వడ్లకొండ పౌరసరఫరాల గోదాం నుంచి బాయిల్డ్ రైస్‌ను 135 లారీల ద్వారా జనగామ రైల్వేస్టేషన్‌లోని వ్యాగన్ పాయింట్‌కు చేర్చారు. అక్కడి నుంచి 42 గూడ్స్ డబ్బాలు కలిగిన ఓ వ్యాగన్‌లో 52 వేల క్వింటాళ్ల బాయిల్డ్ రైస్‌ను తమిళనాడు రాష్ర్టానికి ఎగుమతి చేసినట్లు వారు చెప్పారు. కాగా, తమిళనాడు ప్రభుత్వం అక్కడి పేదలకు తమ రేషన్ షాపుల ద్వారా ఈ బియ్యాన్ని పంపిణీ చేస్తారని సమాచారం. గూడ్స్ రైలులోకి బియ్యాన్ని ఎక్కిచ్చినందుకు ఒక్కో బస్తాకు రూ. 3 చొప్పున తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తున్నట్లు హమాలీలు తెలిపారు. కరోనా ఆపత్కర పరిస్థితిలో తమకు చేతినిండా పని దొరికిందని ఆనందపడుతున్నారు.


logo