శనివారం 24 అక్టోబర్ 2020
Warangal-city - Jul 03, 2020 , 02:57:49

పరకాలను మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా

పరకాలను మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా

  • ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

పరకాల టౌన్: పరకాల మున్సిపాలిటీని మోడల్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. రూ. 35 లక్షల ఎస్‌ఎఫ్‌సీ నిధులతో గురువారం పరకాల మాదారం మెయిన్‌రోడ్డు నుంచి బంధంరోడ్డు వరకు సీసీరోడ్డు, రూ. 15.50 లక్షల 14వ ఆర్థిక సంఘం నిధులతో తహసీల్ ఆఫీస్ ఆవరణలో పబ్లిక్ టాయిలెట్స్, రూ. 20 లక్షల పురపాలక సంఘం సాధారణ నిధులతో ఎస్సీకాలనీలో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సోదా అనిత రామకృష్ణ, వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్‌రెడ్డి, ఆర్డీవో కిషన్, కౌన్సిలర్లు మడికొండ సంపత్‌కుమార్, ఒంటేరు సారయ్య, పొరండ్ల సంతోశ్, గొర్రె స్రవంతి, నల్లెల్ల జ్యోతి అనిల్, అడప రాము, కోడూరి మల్లేశం, పసుల లావణ్య రమేశ్, బండి రాణి సదానందం, మార్క ఉమా రఘుపతి, బండి రమ సారంగపాణి, ఏకు రాజు, ఆర్పీ జయంత్‌లాల్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొజ్జం రమేశ్, పీఏసీఎస్ చైర్మన్లు గుండెబోయిన నాగయ్య, నల్లెల్ల లింగమూర్తి, రైతుబంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్ బొల్లె భిక్షపతి, మున్సిపల్ కమిషనర్ యాదగిరి పాల్గొన్నారు.


logo