మంగళవారం 20 అక్టోబర్ 2020
Warangal-city - Jul 03, 2020 , 02:57:51

అభివృద్ధి పనులు ప్రారంభించిన మేయర్

అభివృద్ధి పనులు ప్రారంభించిన మేయర్

కాశీబుగ్గ, జూలై 02 : నగరంలోని 12వ డివిజన్ దేశాయిపేట్ సీఎస్‌ఐ చర్చి ఎదురు వీధిలో అభివృద్ధి పనులకు మేయర్ గుండా ప్రకాశ్‌రావు గురువారం శంకుస్థాపన చేశారు. కాలనీలో డ్రైనేజీ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సులోచన, మాజీ జెడ్పీటీసీ తూర్పాటి సారయ్య, డీఈ రవీందర్, ఏఈ కృష్ణమూర్తి, పాలడుగుల సురేందర్, దౌడు విజయరావు, మధు, శ్రావణ్, కమలాకర్, జూపాక ప్రకాశం, రత్నం, రవి, సుమన్, ప్రభాకర్, పరంజ్యోతి, రత్నప్రణయ్, భాస్కర్, ప్రదీప్ పాల్గొన్నారు. 

మేయర్‌కు వినతుల వెల్లువ

వరంగల్ : మేయర్ గుండా ప్రకాశ్‌రావుకు వినతులు వెల్లువెత్తాయి. గురువారం కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్‌ను కలిసి పలు కుల సంఘాల నేతలు వినతి పత్రం అందజేశారు. ఇటీవల రజక సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు చిన్నారులు పుట్టలమ్మ చెరువులో పడి మృతి చెందారని వారి కుటుంబాలకు ప్రభుత్వం పక్షాన ఆదుకోవాలని  తెలంగాణ రజక నవ నిర్మాణ సంఘం అధ్యక్షుడు చీకటి రాజు మేయర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. గ్రేటర్ పరిధిలోని ఎరుకల సొసైటీలకు పందుల పెంపకం కోసం నగర శివారు ప్రాంతంలో స్థలాలు కేటాయించాలని తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం నాయకులు సారయ్య, రాములు, రాజు తదితరులు వినతి పత్రం అందజేశారు. అలాగే, ఆర్వోబీ నిర్మాణంలో ఆర్‌అండ్‌బీ అధికారుల విజ్ఞప్తి మేరకు సర్వీస్ రోడ్లకు భూమి ఇచ్చిన నేపథ్యంలో నష్ట పరిహారం చెల్లించేలా కౌన్సిల్ తీర్మానం చేసినందుకు మేయర్ గుండా ప్రకాశ్‌రావు, కమిషనర్ పమేలా సత్పతికి బట్టల బజార్ వర్తక సంఘం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు కౌన్సిల్ హాల్‌లో వారిని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు కాసం శ్యాం, గుండా నమఃశివాయ, తోట మహేశ్,  కాసం మల్లికార్జున్, రాములు పాల్గొన్నారు. 

పెండింగ్ బిల్లులు చెల్లించాలని వినతి

సీఎం హామీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని మేయర్ గుండా ప్రకాశ్‌రావును కాంట్రాక్టర్లు కోరారు. 2018లో రూ.2 కోట్ల సీఎం హామీ నిధులతో పనులు మొదలు పెట్టామని, 30 శాతం పనులు పూర్తి చేశామని తెలిపారు. వాటికి సంబంధించిన బిల్లులు చెల్లిస్తే మిగతా పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. మేయర్‌ను కలిసిన వారిలో కాంట్రాక్టర్లు బొక్క కుమార్, పెద్దమ్మ శ్రీనివాస్, జనగాని సంపత్ కుమార్, వీసం రవీందర్‌రెడ్డి, నేదునూరి కుమార్, వీసం నరేశ్, మధుకర్ తదితరులు ఉన్నారు.logo