సోమవారం 19 అక్టోబర్ 2020
Warangal-city - Jul 03, 2020 , 02:57:51

నిబంధనలకు విరుద్ధంగా పరీక్షల నిర్వహణ!

నిబంధనలకు విరుద్ధంగా పరీక్షల నిర్వహణ!

  • n చైతన్య కళాశాల ఎదుట టీఆర్‌ఎస్వీ నాయకుల ఆందోళన
  • n ఇరువర్గాల మధ్య తోపులాట

హన్మకొండ: కొవిద్-19 నిబంధనలకు విరుద్ధంగా హన్మకొండలోని చైతన్య కళాశాలలో ఆన్‌లైన్ పరీక్షలు, తరగతులు నిర్వహిస్తున్నారనే విషయం తెలుసుకున్న కేయూ టీఆర్‌ఎస్వీ విద్యార్థి విభాగం నాయకులు గురువారం ఉదయం కళాశాలలో ఆందోళన చేపట్టారు.  ప్రభుత్వ ఆదేశాలను లెక్కచేయకుండా పీజీ, డిగ్రీ విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేస్తూ ఆన్‌లైన్ తరగతులు, సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్న కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్వీ నాయకులు, ఉద్యోగుల మధ్య తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు కళాశాలకు చేరుకుని ఇరువర్గాలతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. యాజమా న్యం ఆందోళనకారులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేయూ టీఆర్‌ఎస్వీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్, అర్బన్ జిల్లా కో ఆర్డినేటర్ జీ రాకేశ్‌యాదవ్, రాష్ట్ర కార్యదర్శి రాజేశ్‌నాయక్, కేయూ నాయకులు కార్తీక్, రాకేశ్, శ్రవణ్, శ్రీకాంతాచారి పాల్గొన్నారు.


logo