శుక్రవారం 30 అక్టోబర్ 2020
Warangal-city - Jul 02, 2020 , 01:21:03

ప్రతి గ్రామంలో మంకీ ఫుడ్‌ కోర్టు తప్పనిసరి

ప్రతి గ్రామంలో మంకీ ఫుడ్‌ కోర్టు తప్పనిసరి

కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు

హసన్‌పర్తి, జూలై 01 : ప్రతి గ్రామంలో మంకీ ఫుడ్‌కోర్టు ఏర్పాటు తప్పనిసరి అని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు అన్నారు. మండలంలోని పెంబర్తి శివారులో ఏర్పాటు చేస్తున్న మంకీ ఫుడ్‌ కోర్టులో కలెక్టర్‌ బుధవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామాల్లో కోతుల బెడద పెరగడానికి కారణం వనాలు లేకపోవడమేనన్నారు. ప్రతి గ్రామంలో మంకీ ఫుడ్‌ కోర్టులు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం జిల్లా పరిధిలో గుట్టలున్న ప్రాంతాల్లో ఎక్కువ మంకీ ఫుడ్‌ కోర్టులకు స్థలాన్ని కేటాయించి, పండ్ల మొక్కలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. భూసేకరణ పూర్తయిన చోట పనులను చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో శ్రీనివాస్‌కుమార్‌, తహసీల్దార్‌ రాజేశ్‌కుమార్‌గౌడ్‌, ఎంపీడీవో కక్కెర్ల వీరేశ్‌గౌడ్‌, ఎంపీవో కర్ణాకర్‌రెడ్డి, ఏపీవో విజయలక్ష్మి, ఎంపీవో శ్రీనివాస్‌, ఈసీ శ్రీధర్‌రావు, సర్పంచ్‌ జోరిక పూల, ఎంపీటీసీ కొయ్యడ దీపిక, ఉపసర్పంచ్‌ ఉట్కూరి సునీల్‌, పంచాయతీ కార్యదర్శి హేమలత, కారోబార్‌ చాతాళ్ల సదానందం, టీఆర్‌ఎస్‌ నాయకుడు పెద్ది మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

 వంగరలో స్థలపరిశీలన 

 భీమదేవరపల్లి : మండలంలోని వంగర గ్రామంలో మంకీ ఫుడ్‌ కోర్టు ఏర్పాటుకు  తహసీల్దార్‌ పోలం ఉమారాణి, ఎంపీడీవో భాస్కర్‌ స్థలాన్ని పరిశీలించారు. కోతులు పండ్లు తినేందుకు ఇక్కడి అటవీప్రాంతం అనుకూలంగా ఉంటుందని నిర్ధారించారు. ఇందుకు అవసరమయ్యే పండ్ల మొక్కలను నాటాలని ఈజీఎస్‌ ఏపీవో కుమారస్వామికి సూచించారు. సర్పంచ్‌ ఆలూరి రజిత, ఎంపీటీసీ నల్ల కౌసల్య, ఉపసర్పంచ్‌ నల్లగోని రాజు, ఎంపీవో భాస్కర్‌ పాల్గొన్నారు. 

మొక్కల పెంపకంతోనే మనుగడ

కమలాపూర్‌ : మొక్కల పెంపకంతోనే మానవాళి మనుగడ సాధ్యమని డీఆర్‌డీవో శ్రీనివాస్‌కుమార్‌ అన్నారు. మండల కేం ద్రంలోని పీఏసీఎస్‌ ఆవరణలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో టార్గెట్‌ పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో కరీంనగర్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ సునీల్‌రావు, సింగిల్‌ విండో చైర్మన్‌ పేరాల సంపత్‌రావు, వైస్‌ చైర్మన్‌ ఇంద్రసేనారెడ్డి, తహసీల్దార్‌ జ్యోతివరలక్ష్మీదేవి, ఎంపీడీవో విజయ్‌కుమార్‌, ఎంపీపీ రాణి, జెడ్పీటీసీ కల్యాణి, సర్పంచ్‌ విజయ, డైరెక్టర్లు రమేశ్‌బాబు, సురేందర్‌, యాదగిరి, వెంకట్‌రెడ్డి, రాజేశ్వర్‌రావు, ఎడ్వర్డ్‌, సత్యనారాయణరా వు, ఈవో చోటేమియా పాల్గొన్నారు.  

కేయూ ఫార్మసీ కళాశాలలో.. 

వరంగల్‌ కల్చరల్‌ : కేయూ ఫార్మసీ కళాశాలలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. నూతన ప్రిన్సిపాల్‌గా ప్రొఫెసర్‌ సా రంగపాణి బాధ్యతలు స్వీకరించి, కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం ఆయనను పలువురు విద్యార్థులు, అధ్యాపకులు అభినందించారు.

మడికొండలో..

మడికొండ : మడికొండలో ఆదర్శ యూ త్‌ బాధ్యుడు నిగ్గుల రవి ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారంలో రైతు బంధు సమితి  మండల అధ్యక్షురాలు ఆవాల రాధికారెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. కార్యక్రమంలో పోలపల్లి రామ్మూర్తి, జానపట్ల సాయిరాణి, తౌటిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, నర్ర శ్రీనివాస్‌, రొయ్యల లక్ష్మణ్‌, నిగ్గుల ప్రసాద్‌, లింగాల సతీశ్‌, రవీందర్‌, బొల్లికొండ రవి పాల్గొన్నారు. అలాగే, టీఆర్‌ఎస్‌ మడికొండ అధ్యక్షుడు దువ్వ నవీన్‌ ఆధ్వర్యంలో మొక్కలను పంపిణీ చేశారు. బైరి కొమురయ్య, శ్రీనివాసరావు, సురేశ్‌, సతీశ్‌ పాల్గొన్నారు.