గురువారం 29 అక్టోబర్ 2020
Warangal-city - Jul 02, 2020 , 00:58:04

ఆలయాల్లో తొలి ఏకాదశి పూజలు

ఆలయాల్లో తొలి ఏకాదశి పూజలు


కాశీబుగ్గ/ ఖిలావరంగల్‌ : తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయాల్లో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాశీబుగ్గలోని పురాతన బావి వద్ద శ్రీ రంగనాథస్వామి ఆలయ అభివృద్ధి కమిటీ బాధ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి శుద్ధిచేశారు. కార్యక్రమంలో పెరుమాండ్ల లక్ష్మణ్‌, వంగరి రవి, చిమ్మని గోపి, ఆకెన వెంకటేశ్వర్లు, గంజి సాంబయ్య, విరాట్‌ ప్రకాశ్‌రెడ్డి, గోరంటల సతీశ్‌, మంచాల శ్రీనివాస్‌, సృజన, ప్రధాన అర్చకుడు ఆరుట్ల కృష్ణమాచార్యులు పాల్గొన్నారు. అలాగే,  శ్రీ కాశీవిశ్వేశ్వర, రంగనాథ స్వామి, శ్రీభక్తమార్కండేయ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు.  అలాగే, ఓరుగల్లు కోటలోని స్వయంభూ శ్రీశంభులింగేశ్వరస్వామి ఆలయం, శివనగర్‌లోని సీతారామచంద్రస్వామి, విశ్వనాథకాలనీ, శంభునిపేటలోని శ్రీఅభయాంజనేయస్వామి ఆలయాల్లో ఆరాధనలు, అర్చనలు చేశారు.  కరోనా నేపథ్యంలో భక్తులు భౌతిక దూరం పాటి స్తూ ఆలయాల్లో దేవతామూర్తులను దర్శించుకున్నారు.  

గోవులకు దాణా అందజేత 

రెడ్డికాలనీ : తొలి ఏకాదశి, గోపద్మ వ్రతం సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిరాదరణకు గురైన గోవులకు తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి అర్చక  పురోహిత సంఘం తరుఫున అధ్యక్షుడు నాగిళ్ల వేణుశర్మ దాణా అందించారు. అలాగే, పలివేల్పులలోని లార్డ్‌ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అల్పాహారం, అన్నదానం చేశారు. శుభం భద్రకాళి ఫౌండేషన్‌ పిల్లలకు బిస్కెట్‌ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యం, డింగరి అఖిల్‌, రాజేశ్వర్‌రావు, శివాపురం తరుణ్‌శర్మ, ముత్యాల మల్లికార్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా బీరన్న బోనాలు 

మిల్స్‌కాలనీ : తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా గ్రేటర్‌ 11వ డివిజన్‌లోని ఓ సిటీలో బుధవారం బీరన్న బోనాలను కురుమ కులస్తులు ఘనంగా జరుపుకున్నారు. కంచె సారయ్య, గౌడ నర్సింగం, కంచె సంపత్‌, దెయ్యాల ప్రభాకర్‌, రామ్మూర్తి, రవి తదితరులు పాల్గొన్నారు.

ఉప్పల్‌ గ్రామంలో..

కమలాపూర్‌ : మండలంలోని ఉప్పల్‌లో బీరన్న బోనాలు ఘనంగా జరిగాయి.  గొల్లకురుమలు ఇంటికో బోనం చేసుకుని, ఆలయం వద్దకు వెళ్లి స్వామివారికి నైవేద్యం సమర్పించారు. కార్యక్రమంలో కుల పెద్దలు వీరబోయిన రవి, బండారి ఓదెలు, కొనుపుల రాంచందర్‌ పాల్గొన్నారు. 


logo