శనివారం 04 జూలై 2020
Warangal-city - Jul 01, 2020 , 02:20:06

మొక్కలను నాటి సంరక్షించాలి

మొక్కలను నాటి సంరక్షించాలి

పశుసంవర్ధక, మత్య్స శాఖ కార్యదర్శి అనితా రాజేంద్రన్‌

రెడ్డికాలనీ, జూన్‌ 30 : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ కార్యదర్శి అనితా రాజేంద్రన్‌ సూచించారు. మంగళవారం హన్మకొండ ములుగురోడ్డులోని జిల్లా మత్స్యశాఖ కా ర్యాలయంలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యఅతిథిగా అనితారాజేంద్ర న్‌ పాల్గొని మొక్కలు నాటి, నీళ్లు పోశారు. ఈ సందర్భంగా మొక్కల రక్షణకు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. హ రితహారంలో అందరూ భాగస్వాములు కా వాలని కోరారు. అంతకుముందు ఆమెకు మత్స్యశాఖ ఇన్‌చార్జి అధికారి విజయభారతి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అలాగే, ఉమ్మడి వరంగల్‌ జిల్లా మత్స్యసహకార సంఘం అధ్యక్షుడు బుస్స మల్లేశం ఆధ్వర్యంలో ఆమెకు పుష్పగుచ్ఛం అందజేశారు. కార్యక్రమంలో విజయ డెయిరీ ఎండీ శ్రీనివాస్‌రావు, సిబ్బంది పాల్గొన్నారు.

పాల సేకరణను పెంచాలి

ధర్మసాగర్‌ : పాల సేకరణను పెంచాలని అనితా రాజేంద్రన్‌ సూచించారు. మండల కేంద్రంలో నిర్వహిస్తున్న విజయ పాల శీతలికరణ కేంద్రాన్ని ఆమె సందర్శించారు.   చైర్మన్‌ మహేందర్‌ను  వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాల సేకరణ కేంద్రాలను పెంచాలని, పాడి పరిశ్రమ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను రైతులకు తెలియజేయాలని సూచించారు.  అనంతరం పశువైద్యశాలలో మొక్కలను నాటారు. డీడీ ప్రదీప్‌ కుమార్‌, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారులు వెంకటనారాయణ, రవి కుమార్‌, ఏడీ శ్రీనివాస్‌, ఎంపీడీవో జీ జవహర్‌రెడ్డి, భూమయ్య, పాల శీతలికరణ మేనేజర్‌ సునీల్‌, సర్పంచ్‌ ఎర్రబెల్లి శరత్‌ చంద్రప్రసాద్‌, రైతులు పాల్గొన్నారు. 


logo