ఆదివారం 05 జూలై 2020
Warangal-city - Jul 01, 2020 , 01:51:36

కొవిడ్‌-19 నియంత్రణ చర్యలు చేపట్టాలి

కొవిడ్‌-19 నియంత్రణ చర్యలు చేపట్టాలి

కలెక్టర్‌ రాజీవ్‌గాంధీహన్మంతు

హన్మకొండ, జూన్‌ 30 : జిల్లాలో కొవిడ్‌-19 కేసుల నియంత్రణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీహన్మంతు వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో వైద్యాధికారులతో కొవిడ్‌-19, ఇతర ఆరోగ్య కార్యక్రమాలపై కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోం ఐసోలేషన్‌లో ఉన్న వారిని సంబంధిత వైద్యాధికారులు, సిబ్బంది నిత్యం పర్యవేక్షిస్తూ తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. అలాగే, పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో సర్వే నిర్వహించి, ఎవరికైనా జలుబు, జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలు ఉంటే వెంటనే సమాచారం అందించాలన్నారు. అంతేకాక సర్వే సమయంలో కరోనా వైరస్‌ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేయాలన్నారు.   వైద్యాధికారులు, సిబ్బంది కూడా తగిన వ్యక్తిగత రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. నాన్‌ కొవిడ్‌-19కు సంబంధించిన మాతా శిశు సంక్షేమం, క్షయ వ్యాధి నివారణ, ఎన్‌సీడీ ఇతర కార్యక్రమాల అమలును పర్యవేక్షించాలని వైద్యాధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ కే లలితాదేవి, అడిషనల్‌ డీఎంహెచ్‌వో మదన్‌మోహన్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ యాకూబ్‌పాషా, జిల్లా సర్వేలైన్స్‌ అధికారి కృష్ణారావు పాల్గొన్నారు. 

గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్‌

గుర్తింపు పొందిన రాష్ట్ర, జాతీయ పార్టీల  జిల్లా ప్రతినిధులతో కలిసి కలెక్టర్‌ రాజీవ్‌గాంధీహన్మంతు ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గోడౌన్‌ను ఓపెన్‌ చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు.  కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ఎస్‌ దయానంద్‌, వరంగల్‌ ఆర్డీవో వాసుచంద్ర, కలెక్టరేట్‌ ఏవో సమ్మయ్య, వివిధ పార్టీల నాయకులు ఈవీ శ్రీనివాసరావు, అమరేందర్‌రెడ్డి, శ్యాంసుందర్‌, డాక్టర్‌  స్టీఫెన్‌,  ప్రభాకర్‌రెడ్డి,  నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo