మంగళవారం 20 అక్టోబర్ 2020
Warangal-city - Jun 29, 2020 , 02:02:54

మిత్రమా.. నన్నొదిలి వెళ్లావా..?

మిత్రమా.. నన్నొదిలి వెళ్లావా..?

మాయమైపోతున్నడమ్మా..! మనిషన్నవాడు. మచ్చుకైనా లేడు చూడు.. అని మనుషుల్లో కరువవుతున్న మానవత్వంపై పాట పాడుకుంటున్న తరుణమిది. పైగా కరోనా వచ్చాక మనిషి చనిపోయినా భయంతో దూరం.. దూరం వెళ్తూ మానవత్వానికి సమాధి కడుతున్నాం. కానీ, వానరం నుంచే మనిషి పరిణితి సాధించినా.. వానరాలు మాత్రం సంఘతత్వాన్ని వదులుకోవడం లేదు. అర్బన్‌ జిల్లాలోని రెడ్డికాలనీలో ఓ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌పై కోతి కరెంటు షాక్‌తో చనిపోతే.. దాని దగ్గరకు మరో వానరం వెళ్లి లేపడానికి చేస్తున్న ప్రయత్నం.. పక్కనే మరికొన్ని కోతులు దానికోసం వేచిచూస్తున్న దృశ్యాలు అక్కడున్నవారిని కదిలించాయి. 



logo