మంగళవారం 27 అక్టోబర్ 2020
Warangal-city - Jun 28, 2020 , 01:14:53

విప్రచిత్త మాతగా భద్రకాళీ

విప్రచిత్త మాతగా భద్రకాళీ

  • షోడశీ క్రమంలో మహావజ్రేశ్వరీగా అలంకరణ
  • ఆరో రోజుకు చేరిన శాకంబరీ ఉత్సవాలు
  • భక్తులు భౌతిక దూరం పాటించి అమ్మవారిని దర్శించుకోవాలి: ఈవో

వరంగల్‌ కల్చరల్‌: భద్రకాళీ ఆలయంలో శాకంబరీ మహోత్సవాలు శనివారం ఆరో రోజుకు చేరాయి. ఉదయం విప్రచిత్త రూపంలో, సాయంకాలం షోడశీ క్రమాన్ని అనుసరించి మహావజ్రేశ్వరిగా భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం తెల్లవారుజామునే 5 గంటలకు భద్రకాళీ అమ్మవారికి సుప్రభాత సేవ, నిత్యాహ్నికం, క్షీరాన్న నివేదన, మంత్రపుష్పాలతో నీరాజనంతోపాటు విశేషపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళీ శేషు మాట్లాడుతూ అమ్మవారి దశమహా విద్యలలో ఆద్యవిద్యైన కాళీ సపర్య క్రమంలో షష్ఠికి ఆదిదేవత విప్రచిత్త రూపమని తెలిపారు. కొవిడ్‌-19 నేపథ్యంలో భక్తులు సామాజిక దూరం పాటించి అమ్మవారిని దర్శించుకోవాలని, అమ్మవారికి సమర్పించడానికి ఎలాంటి ద్రవ్యాలు తీసుకురావొద్దని ఈవో ఉమారాణి సూచించారు. 


logo