శుక్రవారం 30 అక్టోబర్ 2020
Warangal-city - Jun 27, 2020 , 02:48:15

‘విరోధినీ’గా అమ్మవారు

‘విరోధినీ’గా  అమ్మవారు

వరంగల్‌ కల్చరల్‌: భద్రకాళి దేవస్థానంలో అమ్మవారి శాకాంబరీ నవరాత్రి మహోత్సవాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం ఉదయం విరోధినీగా, సాయంత్రవేళ వహ్నివాసినీగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి సుప్రభాత సేవ, నిత్యాహ్నికం, క్షీరాన్న నివేదనతోపాటు పలు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు అమ్మవారి దర్శనం, ప్రసాద వితరణ ఏర్పాట్లను ఆలయ అధికారులు పర్యవేక్షించారు.

శాకాంబరీ ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర చీఫ్‌ విప్‌ ఆలయానికి రూ.50వేలు విరాళంగా ఇచ్చినట్లు ఆలయ ఈవో ఉమారాణి తెలిపారు. కొవిడ్‌-19 నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకొనేందుకు మాత్రమే అనుమతి ఇచ్చామని, భక్తులు ఎలాంటి పూజా సామగ్రి వెంట తీసుకురావద్దని ఈవో సూచించారు.