ఆదివారం 25 అక్టోబర్ 2020
Warangal-city - Jun 26, 2020 , 02:21:38

ప్రతి మొక్కనూ కాపాడుకుందాం

ప్రతి మొక్కనూ కాపాడుకుందాం

మండలి చీఫ్‌ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు   n పెద్ద ఎత్తున హరితహారం 

మొక్కలు నాటిన ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, రాజయ్య, జడ్పీ చైర్మన్లు, కలెక్టర్లు

కలెక్టరేట్‌ : తెలంగాణ హరితహారంలో భాగం గా నాటిన ప్రతి మొక్కనూ కాపాడుదామని మం డలి చీఫ్‌ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు పేర్కొ న్నా రు. గురువారం జనగామ నూతన కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆరో విడుత హరితహారం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బోడకుంటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చెట్లను పెంచితేనే సకాలంలో వర్షా లు కురుస్తాయని, ఇంటింటికీ ఆరు మొక్కలు నాటాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కలెక్టర్‌ కే నిఖి ల పేర్కొన్నారు. జడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి, డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఏసీపీ వినోద్‌కుమార్‌, ఆర్డీవో మధుమోహన్‌, కమిషనర్‌ రవీందర్‌, అధికారు లు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు. 

జనగామ రూరల్‌ : ప్రతి పల్లె ఆకుపచ్చగా తయారయ్యేలా అందరూ కృషి చేయాలని మండ లి చీఫ్‌ విప్‌ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పెంబర్తి గ్రామంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఎంపీపీ మేకల కలింగరాజు, జడ్పీటీసీ నిమ్మతి దీపిక, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు బాల్దె సిద్దిలింగం, పీఏసీఎస్‌ చైర్మన్‌ నిమ్మతి మహేందర్‌రెడ్డి, ఎంపీడీవో దార్ల నర్సయ్య, మండల ప్రత్యేకాధికారి శంకర్‌రావు, తదితరులు పాల్గొన్నారు. 

గణపురం : మొక్కలు నాటడం సామాజిక బాధ్యతగా స్వీకరించాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. చెల్పూర్‌లోని రాంచెరువు సమీపంలో ఎమ్మెల్యే సర్పంచ్‌ మధుసూదన్‌రావు, జడ్పీ వైస్‌ చైర్‌ పర్సన్‌ కల్లెపు శోభతో కలిసి మొక్క నాటారు. హరితహారంలో ప్రతి ఒక్క రూ భాగస్వాములు కావాలని సూచించారు. ఎం పీపీ కావటి రజిత, ఎంపీటీసీలు పొనగంటి సుధ ర్మ , చెన్నూరి రమాదేవి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పోట్ల నగేశ్‌, గణపురం పీఏసీఎస్‌ చైర్మ న్‌ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి పాల్గొన్నారు.

హరితహారం కేసీఆర్‌ మానసపుత్రిక..

జఫర్‌ఘడ్‌ : హరితహారం సీఎం కేసీఆర్‌ మాన స పుత్రిక అని ఎమ్మెల్యే డాక్టర్‌ టీ రాజయ్య అభివర్ణించారు. జఫర్‌ఘడ్‌లో ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే రాజయ్య, కలెక్టర్‌ నిఖిల మొక్కలు నాటారు. ఎంపీపీ సుదర్శన్‌, వైస్‌ ఎంపీ పీ కనుకయ్య, జడ్పీటీసీ ఇల్లందుల బేబీ, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు శివయ్య, సర్పం చ్‌ వెంకట నర్సింగరావు, ఎంపీటీసీలు రజిత, స్రవంతి, డీఆర్‌డీవో రాంరెడ్డి, డీపీవో వెంకటేశ్వర్‌రావు, ఆర్డీవో రమేశ్‌, ఎంపీడీవో శ్రీధర్‌స్వామి, తహసీల్దార్‌ హమీద్‌, తదితరులు పాల్గొన్నారు.

స్టేషన్‌ఘన్‌పూర్‌టౌన్‌ : స్టేషన్‌ఘన్‌ఫూర్‌లోని పార్కును సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ పార్కుగా నామకర ణ చేస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్‌ రాజయ్య తెలిపా రు. కలెక్టర్‌ నిఖిలతో కలిసి మోడల్‌ కాలనీలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. జడ్పీ సీఈవో రమాదేవి, జడ్పీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ మారపాక రవి, కుడా సభ్యుడు ఆకుల కుమార్‌, ఆర్డీవో రమే శ్‌, ఎంపీడీవో కుమారస్వామి, డీఎల్‌పీవో కనకదుర్గ, ఎంపీపీ కందుల రేఖగట్టయ్య, వైస్‌ చైర్మన్‌ సుధీర్‌రెడ్డి, సర్పంచ్‌ టీ సురేశ్‌కుమార్‌, ఎంపీటీసీలు గన్ను నర్సింహులు, ఎస్‌ దయాకర్‌, మునిగెల రాజు, తదితరులు పాల్గొన్నారు.      

రఘునాథపల్లి : మండలంలోని నిడిగొండలో ఎమ్మెల్యే డాక్టర్‌ టీ రాజయ్య మొక్కలు నాటారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. తహసీల్దార్‌ బన్సీలాల్‌, జడ్పీటీసీ బొల్లం అజయ్‌కుమార్‌, సర్పంచ్‌ బిర్రు లక్ష్మి, ఎర్రోళ్ల కుమార్‌ గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు. 

ఉద్యమంలా మొక్కలు నాటాలి..

కాటారం : ప్రతి ఒక్కరూ ఉద్యమంలా మొక్క లు నాటాలని పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు, భూపాలపల్లి జడ్పీ అధ్యక్షురాలు జక్కు శ్రీహర్షిణి పేర్కొన్నారు. కాటారం, విలాసాగర్‌లో  ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మొక్కలు నాటా రు. జ డ్పీ సీఈవో శిరీష, ఎంపీడీవో శంకర్‌, తహసీల్దార్‌ మల్లేశం, సర్పంచ్‌లు తోట రాధమ్మ, జనగామ రమాదేవి, ఎంపీటీసీ తోట జనార్దన్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు అర్జయ్య పాల్గొన్నారు. 

మహదేవపూర్‌ : హరితహారంతో పల్లెలన్నీ పచ్చదనంతో నిండుకోవాలని పెద్దపల్లి జడ్పీ చైర్మ న్‌ పుట్ట మధు, భూపాలపల్లి జడ్పీ అధ్యక్షురాలు జక్కు శ్రీహర్షిణి పేర్కొన్నారు. మండల కేంద్రంలో ని కస్తూర్బా ఆశ్రమ పాఠశాల, ఎడపల్లి గ్రామంలో వారు మొక్కలు నాటారు. ఇందులో మహదేవపూర్‌ ఎంపీపీ బన్సోడ రాణిబాయి, జడ్పీటీసీ గుడాల అరుణ, ఎఫ్‌డీవో వజ్రారెడ్డి, ఎఫ్‌ఆర్వో కమల, ఎంపీడీవో సురేందర్‌ పాల్గొన్నారు.

అడవి ముత్తారంగా తీర్చిదిద్దాలి.. 

మహాముత్తారం : మండలాన్ని అడవి ముత్తారంగా తీర్చిదిద్దాలని భూపాలపల్లి కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీం పిలుపునిచ్చారు. మండల కేంద్రం లో మొక్కను నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటగా అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులతో ర్యాలీ తీశారు. సర్పం చ్‌ మందల లతారెడ్డి, ఎంపీపీ రత్నం సుభద్ర, జడ్పీటీసీ లింగమల్ల శారద, ఎంపీటీసీ శ్రీపతి సురే శ్‌, ఉప సర్పంచ్‌ మధూకర్‌, రైతు బంధు మండల అధ్యక్షుడు మందల రాజిరెడ్డి, సింగిల్‌ విండో చైర్మ న్‌ సోమ శాంతకుమార్‌, బాలకృష్ణ, ఎంపీడీవో పెద్ది ఆంజనేయులు, తహసీల్దార్‌ సునీత, తదితరులు పాల్గొన్నారు.   

గణపురం : ఆకుపచ్చ తెలంగాణకు అందరూ సహకరించాలని డీపీవో చంద్రమౌళి కోరారు. మండల కేంద్రం, బుర్రకాయలగూడెంలో మొక్క లు నాటారు. ఇన్‌చార్జి ఎంపీడీవో అనీల్‌కుమార్‌, సర్పంచులు నారగాని దేవేందర్‌గౌడ్‌, కాల్య రజిత బాబు, ఎంపీవో అయిత రామకృష్ణ, ఏపీవో రాజ య్య, ఈసీ శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

కొడకండ్ల : భావితరాల కోసం మొక్కలను నాటాలని డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కుందూరి వెంకటేశ్వర్‌రెడ్డి కోరారు. మొండ్రాయి గ్రామంలో ఆయ న మొక్కలు నాటారు. ఎంపీపీ ధరావత్‌ జ్యోతి, జడ్పీటీసీ కేలోత్‌ సత్తమ్మ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పేరం రాము, గాంధీనాయక్‌, సర్పంచ్‌ ఊర్మెల, తహసీల్దార్‌ జడల రమేశ్‌, ఎంపీడీవో రమేశ్‌, దికొండ వెంకటేశ్వరావు పాల్గొన్నారు,

బచ్చన్నపేట : ప్రతి ఊరిలో మొక్కలు నాటి హరిత మండలంగా తీర్చిదిద్దుతామని రైతుబంధు జిల్లా కోఆర్డినేటర్‌ ఇర్రి రమణారెడ్డి, జడ్పీవైస్‌ చైర్‌పర్సన్‌ గిరబోయిన భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. ఎంపీపీ బావండ్ల నాగజ్యోతి, పీఏసీఎస్‌ చైర్మన్‌ పులిగిళ్ల పూర్ణచందర్‌, సర్పంచ్‌ వడ్డేపల్లి మల్లారెడ్డితో కలిసి మార్కెట్‌ గోదాముల వద్ద మొక్కలు నాటారు. మండల కోఆప్షన్‌ సభ్యులు షబ్బీర్‌, ఉప సర్పంచ్‌లు హరికృష్ణ, కవిత, ఎంపీ వో రఘురామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. 

జనగామటౌన్‌ : మొక్కలను సంరక్షించడం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని డీఈవో సిగసారపు యాదయ్య పేర్కొన్నారు. కార్యాలయంలో ఆయన మొక్కలు నాటారు. అధి కారులు, సిబ్బంది ఉన్నారు.


logo