గురువారం 22 అక్టోబర్ 2020
Warangal-city - Jun 26, 2020 , 02:03:32

అట్టహాసంగా ఆరో విడుత మొదలు

అట్టహాసంగా ఆరో విడుత  మొదలు

  • ఊరూరా పచ్చని పండుగ సందడి
  • మొదటి రోజు మొక్కలు నాటిన మంత్రి ఎర్రబెల్లి, మండలి చీఫ్‌ విప్‌, ఎంపీలు
  • నియోజకవర్గాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు, అధికారులు 
  • ఆనందోత్సాహాల నడుమ మమేకమైన సబ్బండవర్గాలు

పుడమి తల్లిని పచ్చలహారంలా మార్చే ఆరో విడత హరితోత్సవం గురువారం అట్టహాసంగా మొదలైంది. పల్లె, పట్నం తేడా లేకుండా జ(వ)న చైతన్యం వెల్లువెత్తింది. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఆనందోత్సాహాల నడుమ మొక్కలు నాటడం కనిపించింది. ఆయాచోట్ల స్వచ్ఛందంగా, సామూహికంగా పాల్గొనడంతో ఆద్యంతం పండుగ వాతావరణం నెలకొన్నది. వరంగల్‌ రూరల్‌ జిల్లా దుగ్గొండి మండలం చల్లపర్తి, గీసుగొండ మండలం మరియపురం, జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, జనగామ కలెక్టర్‌ క్యాంప్‌ ఆఫీసు ఆవరణలో, పెంబర్తి గ్రామంలో మండలి చీఫ్‌ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు మొక్కలు నాటగా, సబ్బండవర్గం వారివెంటే కదిలింది.

వరంగల్‌ ప్రతిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో ఆరో విడుత హరితహారం, ఆద్యంతం పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధుల స్వచ్ఛందంగా, సామూహికంగా మొక్కలు నాటడంతో ఎటుచూసినా సందడి నెలకొన్నది. వరంగల్‌ రూరల్‌ జిల్లా దుగ్గొండి మండలం చల్లపర్తి, గీసుగొండ మం డలం మరియపురం, జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరులో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు.  ఆయాచోట్ల ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్లు కుడుముల నిఖిల, ముండ్రాతి హరితతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ హితానికే హరితహారం చేపట్టారని, మానవాళి మనుగడకు చెట్లే జీవనాధారమని మంత్రి వివరించారు.

అలాగే మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ పట్టణంలోని రామకృష్ణా రియల్‌ ఎస్టేట్‌ గ్రీన్‌ పార్క్‌లో ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌, కలెక్టర్‌ గౌతమ్‌, ఎస్పీ కోటిరెడ్డి, జడ్పీచైర్‌ పర్సన్‌ బిందు, గ్రంథాలయ చైర్మన్‌ నవీన్‌, యువ నేత రవిచంద్రతో కలిసి మొక్కలు నా టారు. అలాగే నర్సింహులపేటలో మంకీ ఫుడ్‌ కోర్టులో మంత్రి మొక్క లు నాటారు. మంత్రి మాట్లాడుతూ చెట్లతోనే మానవ మనుగడ ముడిపడి ఉందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు.

ఆయాచోట్ల ఎంపీలు, ఎమ్మెల్యేలు

జనగామ కొత్త కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో, జనగామ మండలం పెంబర్తి గ్రామంలో జడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డితో కలిసి మండలి చీఫ్‌ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు మొక్కలు నాటారు. కాటారం మండల కేంద్రం, విలాసాగర్‌ గ్రామం, మహదేవపూర్‌ మండల కేంద్రంలోని కస్తూర్బా ఆశ్రమ పాఠశాల ఆవరణలో, ఎడపల్లి గ్రామంలో పెద్దపల్లి, భూపాలపల్లి జడ్పీ చైర్మన్లు పుట్ట మధు, జక్కు శ్రీహర్షిణి మొక్కలు నాటారు. గణపురం మండలం చెల్పూర్‌లో జడ్పీవైస్‌ చైర్మన్‌ కల్లెపు శోభ తో కలిసి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మొక్క లు నాటారు. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో కలెక్టర్‌ కార్యాలయం వద్ద, మహబూబాబాద్‌ మం డలం జంగిలికొండ పంచాయతీలోని మంకీపుడ్‌ కోర్టులో ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌, స్టేషన్‌ఘన్‌ఫూర్‌ మండల కేంద్రంలోని మోడల్‌ కాలనీలో కలెక్టర్‌ నిఖిలతో కలిసి ఎమ్మెల్యే టీ రాజయ్య మొక్క లు నాటారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లోని పార్కుకు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ పార్కుగా నామకరణం చేస్తున్నట్లు తెలిపారు. చిన్నగూడూరు మండలం విసంపల్లిలో 

టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్‌రావ్‌ స్థానికులతో కలిసి మొ క్కలు నాటారు. నగరంలోని రంగశాయిపేటలోని 22వ డివిజన్‌లో మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ పాల్గొన్నారు. మంకీ ఫుడ్‌ కోర్టుకు శంకుస్థాపన చేసి మొక్కలు నాటారు. దేశాయిపేట్‌లోని సీకేఎం కళాశాల మైదానంలో కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంత్‌, కమిషనర్‌ పమేల సత్పతి, సీపీ రవీందర్‌, కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డితో కలిసి మొక్కలు నాటారు. పరకాల పట్టణంలోని సాయిబాబా ఆలయం నుంచి ఎల్‌ఐసీ భవనం వరకు  ప్రధాన రహదారికి ఇరువైపులా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మొక్కలు నాటారు. హసన్‌పర్తి మండలం అనంతసాగర్‌లో ఎంపీ పసునూరి దయాకర్‌తో కలిసి ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ పాల్గొన్నారు. ములుగు మండలం పందికుంట గ్రామం లో ఎమ్మెల్యే, సీతక్క, కలెక్టర్‌ కృష్ణ ఆదిత్యతో కలిసి జడ్పీ చైర్మన్‌ జగదీశ్వర్‌ మొక్కలు నాటారు.logo