ఆదివారం 25 అక్టోబర్ 2020
Warangal-city - Jun 23, 2020 , 01:26:33

వీధి వ్యాపారులకు రుణాల మంజూరు..

వీధి వ్యాపారులకు రుణాల మంజూరు..

వరంగల్‌, జూన్‌ 22:  ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్‌ నిధి ద్వారా వీధి వ్యాపారులకు రూ. 10 వేల రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని కేంద్రప్రభుత్వ అండర్‌ సెక్రటరీ బీఎస్‌ బాలచం ద్రన్‌ అదేశించారు. సోమవారం న్యూఢిల్లీ నుంచి ఆయన మున్సిపల్‌ కమిషనర్లతో వీడియో కాన్ఫరె న్స్‌ నిర్వహించారు. ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్‌ నిధి విధివిధానాలను, రుణాల మంజూరు కోసం అన్‌లైన్‌ నమోదు ఎలా చేసుకోవాలన్న దానిపై ఆయన పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివ రించారు. సందేహాలను నివృత్తి చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ  కేంద్రప్రభుత్వం వీధి వ్యాపారుల సంక్షేమం కోసం ఆత్మ నిర్భర్‌ పథకాన్ని తీసువచ్చిందని అన్నారు. లైసెన్స్‌లు, వెండర్‌ జోన్ల ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పించాలని అన్నారు. మున్సిపల్‌ కమిషనర్లు తమ పరిధిలోని వీధి వ్యాపారులను గుర్తించి ఆన్‌లైన్‌లో రుణం కోసం నమోదు చేసునేలా చర్యలు తీసుకోవాలని ఆయన అదేశించారు. దీనిపై కమిషనర్‌ పమేలా సత్పతి స్పందించి మాట్లాడుతూ గ్రేటర్‌ వరంగల్‌ పరిధి లో 5005 మంది వీధి వ్యాపారులను గుర్తించామ ని తెలిపారు. 2500 మంది అన్‌లైన్‌లో రుణం కోసం నమోదు చేసుకున్నారని వివరించారు. అన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వారికి రూ.10 వేల రుణం మంజూరుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మిగిలి ఉన్న వారిని గుర్తించేందు కు సర్వే చేస్తున్నామని తెలిపారు. మున్సిపల్‌ కమిషనర్‌ అధ్యక్షతన వీధి వ్యాపారుల కమిటీని ఏ ర్పా టు చేసి అర్హులకు రుణాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని ఆమె వివరించారు. బల్దియా కార్యదర్శి విజయలక్ష్మి, డీఎంసీ రజితారాణి, సతీశ్‌, టీఎంసీ రమేశ్‌ పాల్గొన్నారు.


logo